Nee Sneham: ఆ పాట తలచుకుని ఎమోషనల్ అవుతున్న ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్..!
November 2, 2022 / 12:26 PM IST
|Follow Us
ఫస్ట్ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో చిన్న ఏజ్‌లోనే స్టార్ డమ్ తెచ్చుకుని.. దాన్ని కాపాడుకోడానికి చాలా ట్రై చేశాడు ఉదయ్ కిరణ్.. తర్వాత తను నటించిన చిత్రాలు చాలా వరకు యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి.. ఆర్తి అగర్వాల్‌తో తను నటించిన ‘నీ స్నేహం’ మూవీ 2002 నవంబర్ 1న రిలీజ్ అయ్యింది.. ఈ 2022 నవంబర్ 1కి 2 దశాబ్దాలు (20 సంవత్సరాలు) పూర్తి చేసుకుంటోంది.. ఈ సందర్భంగా ‘నీ స్నేహం’ విశేషాలు చూద్దాం..
పరుచూరి మురళి దర్శకత్వంలో, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎమ్.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘నీ స్నేహం’ లో ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్, హీరోయిన్ తాత పాత్రలో నటించారు. ఉదయ్ స్నేహితుడిగా జతిన్ కనిపించాడు. స్నేహం, ప్రేమ అనే రెండు విడదీయలేని ఈ బంధాల్నే కథాంశంగా రూపొందిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ యూత్‌కి బాగా నచ్చింది.. ఉదయ్ తన నేచురల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో జీవించేశాడు..
ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్.. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి.. ఈ మూవీలోని పాటలన్నిటినీ సిరివెన్నెల రాయడం విశేషం.. ‘చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా’ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపించేంది. ఈ పాటకుగానూ సింగర్ ఉషా నంది అవార్డు అందుకున్నారు. ఉదయ్ కిరణ్ నటించిన ‘నీ స్నేహం’ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఫ్యాన్స్, ఆడియన్స్ ఉదయ్‌కి నివాళులర్పిస్తూ..
ఈ సినిమాని ఏ ప్రాంతంలో, ఏ థియేటర్లో చూశామనే మెమరీస్ షేర్ చేస్తున్నారు. అప్పట్లో యువత అందరికీ ఈ సినిమా బాగా నచ్చిందని పోస్టులు చేస్తున్నారు.. ‘‘హీరో హీరోయిన్ల పెయిర్, సాంగ్స్ అన్నీ బాగుంటాయి.. ఫ్రెండ్షిప్ సాంగ్‌తో పాటు ఉదయ్ కిరణ్ బ్రేకప్ సాంగ్ ‘ఊరుకో హృదయమా’ చాలా మంది ఫేవరెట్.. ఇప్పుడీ సాంగ్ వింటుంటే ఉదయ్ కిరణ్ గుర్తొస్తున్నాడు’’.. అంటూ ఎమోషనల్ అవుతున్నారు..