Chiranjeevi: డిజిటల్ ఎంట్రీ విషయంలో మెగాస్టార్ తప్పు చేస్తున్నారా?
July 9, 2022 / 10:29 AM IST
|Follow Us
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మెగాస్టార్ చిరంజీవికి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. రీఎంట్రీలో చిరంజీవి నటించిన సినిమాలలో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు సక్సెస్ సాధించగా ఆచార్య సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదనే సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు మాస్ మసాలా సినిమాలు కావడం గమనార్హం. అయితే చిరంజీవి డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వార్త మెగా అభిమానులను తెగ టెన్షన్ పెడుతోంది. ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న చిరంజీవి డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు. సరైన కథను ఎంచుకోకుండా చిరంజీవి డిజిటల్ ఎంట్రీ ఇస్తే విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది. డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం వల్ల చిరంజీవి నటిస్తున్న సినిమాలపై కూడా ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
సరైన కథను ఎంచుకోకుండా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం వల్ల విమర్శలు వ్యకమయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మెగాస్టార్ స్పందిస్తే మాత్రమే డిజిటల్ ఎంట్రీకి సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిరంజీవి తన సినిమాలు పండుగలకు విడుదలయ్యే విధంగా జాగ్రత్త పడుతున్నారు. రాబోయే 12 నెలల్లో చిరంజీవి నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఈ మూడు సినిమాలకు 300 కోట్ల రూపాయల స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.