LEO: లియో సినిమా విషయంలో ఏది నమ్మాలి లోకేశ్.. నువ్వైనా చెప్పు అంటూ?

  • October 25, 2023 / 12:33 PM IST

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. అయితే లియో సినిమా క్లైమాక్స్ ల విషయంలో నెటిజన్ల నుంచి వెరైటీ ఫీడ్ బ్యాక్ వస్తోంది. అమెరికాలో ఐమ్యాక్స్ వెర్షన్ లో లియో మూవీ ఒక విధంగా ఉందని, ఇతర థియేటర్లలో మరో విధంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

లియో సినిమా క్లైమాక్స్ లో విజయ్ తాను లియో దాస్ అని మొదట అర్జున్ పాత్రకు రివీల్ చేసి ఆ తర్వాత సంజయ్ దత్ కు కూడా తాను లియో అని చెప్పినట్టు చూపించారు. అయితే ఐమ్యాక్స్ వెర్షన్ లో కేవలం అర్జున్ పాత్రకు మాత్రమే లియో అని చెప్పినట్టు చూపించారట. మరికొన్ని స్క్రీన్లలో సంజయ్ దత్ చనిపోయిన సమయంలో లియో అని రివీల్ చేసినట్టు చూపించారని సమాచారం అందుతోంది.

లియో (LEO) ఎడిటింగ్ లో లోపాల వల్ల ఈ విధంగా జరుగుతోందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. లియో సినిమా విషయంలో ఏది నమ్మాలి లోకేశ్ అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో సంతృప్తితో ఉన్నానని చెబుతున్నారు. అయితే లోకేశ్ కనగరాజ్ లియో వెర్షన్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

లోకేశ్ కనగరాజ్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. లోకేశ్ కనగరాజ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి మరిన్ని విజయాలు అందుకుంటారేమో చూడాలి. లోకేశ్ తర్వాత మూవీ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోంది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus