స్టార్ హీరో ప్రభాస్ లుక్ ను ట్రోల్ చేస్తూ కొన్ని రోజుల క్రితం తీవ్రస్థాయిలో ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మీడియా ప్రభాస్ లుక్ గురించి నెగిటివ్ గా ప్రచారం చేసింది. వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ విశ్రాంతి లేకపోవడం వల్ల లుక్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. రాముడి పాత్ర ద్వారా ప్రభాస్ స్థాయి మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం యూకేలో ప్రభాస్ వరల్డ్ క్లాస్ డాక్టర్ మరియు డైటీషియన్ ను కలిసి బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ కొరకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. త్వరలోనే ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు కొత్త లుక్ తో రానున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రభాస్ మూడు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కె సినిమాలో కూడా ప్రభాస్ నటించబోతున్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.
ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రభాస్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తన లుక్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వల్ల ప్రభాస్ బాధ పడ్డారని ఆ కామెంట్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!