నకిలీ అకౌంట్స్ తో ఎన్టీఆర్ చిత్రాలపై చెడుగా ప్రచారం
October 19, 2016 / 09:11 AM IST
|Follow Us
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో జోరు మీదున్నారు. టెంపర్ సక్సస్ తో హిట్ ట్రాక్ ఎక్కిన తారక్ వేగంగా దూసుకు పోతున్నారు. నాన్నకు ప్రేమతో చిత్రం తో క్లాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. జనతా గ్యారేజ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువై ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్ ఫోటోలు, డైలాగులు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్ లో జనతా గ్యారేజ్, టీజర్, ట్రైలర్ లకు మాత్రమే కాదు రీసెంట్ గా అప్లోడ్ అయిన వీడియో సాంగ్స్ కి విపరీతమైన స్పందన వస్తోంది. ఎక్కువమంది వీక్షిస్తున్నారు. థియేటర్లలోనూ, నెట్లోనూ తారక్ హవా చూసి ఓ హీరో అభిమానులకు నిద్ర పట్టడం లేదు.
దీంతో ఎన్టీఆర్ క్రేజ్ ని తగ్గించేందుకు ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ పేరు మీద సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి జనతా గ్యారేజ్ కలక్షన్లంతా అబద్ధం, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో ఆ సినిమా తక్కువగా వసూల్ చేసిందని కొన్ని రోజులుగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఈ విషయం సదరు జర్నలిస్ట్ వరకు చేరడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. సైబర్ పోలీసులు నకిలీ ఖాతా తెరిచిన వారిని పట్టుకోవడంతో ఈ కుట్ర అంతా బయట పడింది. ఇటువంటి యాంటీ అభిమానులతో హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు.