Beast Movie: ‘బీస్ట్‌’ సినిమాపై దర్శకుడు నెల్సన్‌ క్లారిటీ!

  • April 9, 2022 / 11:14 AM IST

‘బీస్ట్‌’ సినిమా అనౌన్స్‌మెంట్‌, పోస్టర్‌, పాటలు… వచ్చినంతవరకు సినిమా మీద ఉన్న ఆలోచన ఒకటి. సినిమా ట్రైలర్‌ విడుదలైన తర్వాత ఆలోచనలు మారిపోయాయి. సినిమా గురించి, సినిమా కథ గురించి కొన్ని రకాల చర్చలు సాగుతున్నాయి. సోషల్‌ మీడియాలో అయితే ఈ సినిమా ఫలానా సినిమాకి కాపీ అనేస్తున్నారు. ఈ మాట అ నోట, ఈ నోట చేరి ఆఖరికి దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ వరకు వెళ్లింది. దీంతో సినిమా రీమేక్‌ పుకార్లపై ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు.

విజయ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు నెల్సన్‌ దిలీప్‌. ఆయన కోరిక మూడో సినిమాకే నెరవేరింది. ‘బీస్ట్‌’ కథ విజయ్‌కి చెప్పడం, ఆయన ఒప్పుకోవడం జరిగిపోయాయి. అయితే ఈ సినిమా ‘గూర్కా’ సినిమాకు కాపీ అని వార్తలు వచ్చాయి. షాపింగ్‌మాల్‌ హైజాక్‌ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘బీస్ట్‌’ కూడా అలాంటిదే కానీ, ఈ సినిమా వేరే కోణంలో ఉంటుంది అని చెప్పారు దర్శకుడు నెల్సన్‌.

‘బీస్ట్‌’ సినిమా దాదాపు 80 శాతం సన్నివేశాలు షాపింగ్‌ మాల్‌లోనే చిత్రీకరించారట. ఈ సినిమా విజయ్‌ అభిమానులకు కచ్చితంగా సరికొత్త వినోదాన్ని పంచిపెడతాం అని చెబుతున్నారు నెల్సన్‌. విజయ్‌ అభిమానులను సంతృప్తి పరచాలని నిర్ణయించుకుని రాసుకున్న కథే ‘బీస్ట్‌’ అని చెప్పారు. విజయ్‌ రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను రాసుకొచ్చారట. మామూలుగా విజయ్‌ సినిమాలంటే నాలుగు పాటలు, మాంచి ఫైట్‌లు ఉంటాయి. కానీ ‘బీస్ట్‌’ సినిమాలో అలాంటివేం చూడము అని చెబుతున్నారు నెల్సన్‌.

‘బీస్ట్‌’ కథను నెల్సన్‌ తన స్నేహితులకు చెబితే ‘విజయ్‌ ఈ కథను ఒప్పుకుంటాడా’ అని అడిగారట. అయితే నెల్సన్‌ తన కథపై, తనపై నమ్మకంతో విజయ్‌కి కథ వినిపించారట. అందుకు తగ్గట్టే విజయ్‌ కథను ఓకే చేశారట. ఇప్పుడు సినిమా కూడా సిద్ధమైపోయి ఈ నెల 13న విడుదలవుతోంది. మరి సినిమా ఎలా ఉంటుంది, ‘గుర్కా’కి దీనికి ఉన్న సారూప్యతలు ఏంటో ఆ రోజు తెలుస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus