నేనే రాజు నేనే మంత్రి మూవీ థియేట్రికల్ ట్రైలర్ | రానా | కాజల్
June 23, 2017 / 04:43 AM IST
|Follow Us
సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో కాజల్, కేథరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. 1.22 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆడియన్స్ ను ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచడంలో ముఖ్యపాత్ర పోషించనుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ..“రాణాలోని సరికొత్త యాంగిల్ ను “నేనే రాజు నేనే మంత్రి”లో చూస్తారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రాణా ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది” అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..“రాణా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తేజ టేకింగ్ చాలా కొత్తగా ఉండబోతోంది. ప్రేక్షకులకు “నేనే రాజు నేనే మంత్రి” ట్రైలర్ చూశాక సినిమాపై మంచి అవగాహన వస్తుంది” అన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.