నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
September 16, 2022 / 11:51 PM IST
|Follow Us
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. తొలుత ఈ చిత్రానికి దర్శకుడు వేరే అతనయినప్పటికీ.. అనంతరం ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సస్ కారణంగా.. అతడి స్థానంలోకి “ఎస్ ఆర్ కళ్యాణమండపం” ఫేమ్ శ్రీధర్ వచ్చాడు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలే గత రెండు సినిమాలతో డిజాస్టర్లు చవిచూసిన కిరణ్ కు.. ఈ సినిమా అయినా విజయాన్ని అందించిందో లేదో చూద్దాం..!!
కథ: బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతుంటాడు వివేక్ (కిరణ్ సబ్బవరం), రోజు అతని క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటుంది తేజు (సంజన ఆనంద్). క్యాబ్ బుక్ చేసుకున్న ప్రతిసారి ఆమె తాగుతూ ఉండడం గమనించిన వివేక్.. ఆమె కథ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కట్ చేస్తే.. ఆమె కథకు, తన లవ్ స్టోరీకి లింక్ ఉందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఏమిటా లింక్ ? అసలు తేజు ఎందుకు ఎప్పుడు తాగుతూ ఉంటుంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “నేను మీకు బాగా కావాల్సినవాడిని”.
నటీనటుల పనితీరు: కిరణ్ అబ్బవరం నటుడిగా పర్వాలేదు అనిపించుకున్నా.. డైలాగ్ డెలివరీలో విషయంలో మాత్రం తడబడుతున్నాడు. అతడి యాస రెగ్యులర్ అయిపోయింది. ప్రతి సినిమాలో అదే తరహా యాస వినిపిస్తుండడంతో కాస్త బోర్ కొడుతుందని చెప్పాలి. అలాగే ఎమోషనల్ సీన్స్ లో సబ్టిల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోలేకపోతున్నాడు.
మరీ ముఖ్యంగా బాబా మాస్టర్ ఎనర్జీని మ్యాచ్ చేయలేక చాలా ఇబ్బందిపడ్డాడు. సంజన ఆనంద్, సోను ఠాకూర్ గ్లామర్ డోస్ బాగానే యాడ్ చేశారు. ఇంకా సినిమాలో లెక్కకుమిక్కిలి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. ఎవరి పాత్రకూ సరైన జస్టిఫికేషన్ లేకపోవడంతో ఎవరి క్యారెక్టర్ కూడా సరిగా ఎస్టాబ్లిష్ కానీ ఎలివేట్ కానీ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ఈ చిత్రానికి కథానాయకుడు మాత్రమే కాక డైలాగ్ రైటర్ కూడా కిరణ్ అబ్బవరం.. అనవసరమైన ఎలివేషన్ డైలాగులు, ప్రాసలు, పంచ్ లతో ఎక్కడలేని చిరాకు తెప్పించాడు. సోషల్ మీడియా ట్రోల్స్ తరహాలో డైలాగ్స్ ఉండడం గమనార్హం. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఇక దర్శకుడు శ్రీధర్ గాదె.. కొన్ని సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం జుగుప్సాకరంగా ఉండగా.. పాటల ప్లేస్ మెంట్, సెంటిమెంట్ సీన్స్ & అనవసరమైన ఎలివేషన్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి. ఓవరాల్ గా శ్రీధర్ గాదె దర్శకుడిగా దారుణంగా విఫలమయ్యాడు.
విశ్లేషణ: తన అభిమానులు గర్వపడే సినిమాలు మాత్రమే అందిస్తానని మాట ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఈ తరహా తలా తోక, క్వాలిటీ లేని సినిమాలతో కెరీర్ ను నెట్టుకురావడం అనేది చాలా కష్టం. ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. ఇక ఈ సినిమాను థియేటర్లో చూడాలనుకోవడం కూడా ఓ సాహసమనే చెప్పాలి.