Balakrishna: అన్ స్టాపబుల్ ఎఫెక్ట్… కొత్త షో ప్లానింగ్ లో నెట్ ఫ్లిక్స్!
December 31, 2022 / 04:32 PM IST
|Follow Us
కరోనా వ్యాపించడంతో ఓటీటీ సంస్థలకు ఎంతో మంచి ఆదరణ లభించిందని చెప్పాలి. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ సమస్థను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆహా ద్వార ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు, టాక్ షోలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ లభించింది. ఈ కార్యక్రమానికి నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో రెండవ సీజన్ అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ కూడా లభిస్తుంది.ఇక ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ మంచి ఆదరణ సంపాదించుకోవడం కోసం ఆహా వారు సబ్ టైటిల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ సిని రాజకీయ ప్రముఖులను తమ కార్యక్రమానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున వారిని ప్రశ్నిస్తూ వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి చాలా మంచి ఆదరణ రావడంతో ఆహా బాటలోనే మరొక ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ సైతం సరికొత్త టాక్ షో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉందని సమాచారం. ఇక నెట్ ఫ్లిక్స్ కూడా ఈ కార్యక్రమాన్ని బాలకృష్ణ చేత చేయించాలనే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే సబ్స్క్రైబ్ విషయంలో ఆహా కన్నా నెట్ ఫ్లిక్స్ కు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇక నెట్ ఫ్లిక్స్ లో బాలయ్య టాక్ షో రాబోతుంది అనడంతో ఈ కార్యక్రమానికి ఇతర దేశాలలో కూడా మంచి ఆదరణ వస్తుందని చెప్పాలి. అయితేమరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది..