ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో చెత్త చర్చలు.. ఇలా అయితే కష్టమే!
March 1, 2023 / 04:17 PM IST
|Follow Us
సోషల్ మీడియా సినిమాలకు ఎంతగా ఉపయోగపడుతోందో.. అంతకంటే ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రచారానికి ఈ కొత్త మీడియాను వాడుకుంటున్న సినిమా టీమ్.. దాని సైడ్ ఎఫెక్ట్‌లతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. తాజాగా సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరుతో కొంతమంది మన టాలీవుడ్ సినిమా ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా పరిశ్రమ పరువును అంతర్జాతీయ వేదికగా గంగలో కలిపేస్తున్నారు. ఏకంగా ఓ అవార్డుల సంస్థ ‘మీ హీరోను కూడా పిలిచాం.. ఆయనే రానన్నారు. త్వరలో అవార్డు కూడా ఇస్తాం’ అని చెప్పింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
టాలీవుడ్లో ఓ హీరోకు ఇంటర్నేషనల్ వేదికల మీద గుర్తింపు దొరుకుతతోంది అంటే ఎంత ఆనందపడాలి. కానీ రామ్ చరణ్ ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరై, ప్రజెంటర్‌గా వ్యవహరిస్తే.. దాన్ని తట్టుకోలేని వాళ్లు ఉన్నారు అంటే ఏమనాలి. నచ్చకపోతే కామ్‌గా ఉండాలి కానీ.. మన పరువును ట్విటర్లో పీకి పాకాన పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్. ఇక్కడ చరణ్‌ను, అవార్డు ఇచ్చిన సంస్థను, చరణ్‌ను ఆ వేదిక మీద పొగిడిన నటిని ట్విటర్లో తెగుడుతుంటే అసలు వీళ్లు ఫ్యాన్సేనా అనిపిస్తుంది.
అయితే వాళ్లు నిజంగానే ఫ్యాన్సా? లేక ఈ పేరుతో ట్రోల్ చేసి, నానా మాటలు అని చోద్యం చూసే బ్యాచా అనేది ఈజీగా అర్థమైపోతుంది. చాలా రోజుల నుండి సినిమా ఇండస్ట్రీలో వినిపించే మాటే.. ‘మేమంతా ఒకటే.. మీరెందుకు విరోధులుగా ఉంటారు’. ఈ మాట ఎవరో చెప్పింది కాదు.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలే చెప్పారు. హీరోల స్టైల్, మాట తీరు, డ్రెస్సింగ్.. ఇలా అన్నీ నేర్చుకునే, అలవర్చుకునే అభిమానులు మంచి విషయంలో ఎందుకు ముందుకు రారో తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా జమానాలో ట్రోలింగ్ అనే గౌరవనీయంగా వినిపించే పేరు పెట్టుకుని.. ఏదేదో అనేసి XXXఆనందం పొందడం ఎంతవరకు కరెక్ట్ అని సగటు సినిమా ప్రేక్షకుడు ప్రశ్నిస్తున్నాడు.
అవునా, ఎక్కడా మాకెక్కడా వినిపించలేదే అని అంటారా? అయితే చెవులు తుప్పు వదిలేలా ఓ అరుపు మీ పక్కవాళ్లను మీ చెవిలో అరవమని అడిగి, కళ్లను బాగా నీళ్లతో కడిగి.. అప్పుడు సోషల్ మీడియాలోనే చూడండి. మేం చెప్పిందంతా కనిపిస్తుంది. అప్పటికీ కనిపించడం లేదంటే మీరు చూడలేదని అర్థం. లేదంటే చూసినా మీకు అర్థం కావడం లేదని అర్థం. ఆఖరిగా చెప్పేది ఏంటంటే.. పరువు తీయకండ్రా బాబూ! ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో మీ చెత్త చర్చలు, రాతలతో కష్టమే! మీకో, మీ హీరోకో కాదు. మొత్తంగా సినిమా పరిశ్రమకు.