Suhasini: నేటిజన్ కామెంట్ కు ఫన్నీ రిప్లై ఇచ్చిన నటి సుహాసిని?

  • July 14, 2022 / 02:01 PM IST

సాధారణంగా సెలబ్రిటీలకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది అభిమానులు నేరుగా తమ అభిమాన హీరో హీరోయిన్లతో స్వయంగా మాట్లాడుతున్నారు. అయితే సెలబ్రిటీలు తమకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఎంతో మందిని నేటిజన్ లు ఆ ఫోటోలపై స్పందిస్తూ పాజిటివ్ కామెంట్లు చేయడం లేదా నెగిటివ్ కామెంట్లు చేయడం చేస్తుంటారు.

అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు వారి గురించి నెగటివ్ కామెంట్లు చేసే వారి పట్ల స్పందిస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణమవుతుంటారు. అయితే కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు. మరి కొంత మంది ఆ కామెంట్లపై స్పందిస్తూ ఫన్నీగా రిప్లై ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సీనియర్ నటి సుహాసిని గురించి ఒక కామెంట్ చేశారు. ప్రస్తుతం సుహాసిని నటిస్తున్న పలు ప్రాజెక్టులకు సంబంధించి ఫోటోషూట్ చేశారు.

ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఎంతోమంది ఆమె ఫోటోలపై స్పందిస్తూ కామెంట్లు చేశారు.. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఏకంగా ఈ ఫోటోలపై స్పందిస్తూ మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ ఫోటోలలో అచ్చం పదహారేళ్ల పిల్లల ఉన్నారు లవ్ యు మేడం అంటూ కామెంట్ చేశారు.ఇక ఈ కామెంట్ పై సుహాసిని స్పందిస్తూ ఫన్నీ రిప్లై ఇచ్చారు.

హ హ అంటూ నవ్వేస్తూ 16 నుకాస్త రివర్స్ చేస్తే అది నా కరెక్ట్ ఏజ్ అంటూ ఆమె తన వయసును చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి సుహాసిని ఈ విధంగా రిప్లై ఇవ్వడంతో నేటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇక సుహాసిని సినిమాల విషయానికి వస్తే.. ఈమె హైదరాబాద్ మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్ లో ఏకంగా అమ్మమ్మ పాత్ర ద్వారా అందరిని సందడి చేశారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus