Koratala Siva: ఆ తప్పు చేస్తే స్టార్ డైరెక్టర్లకు నష్టమేనా?
July 15, 2022 / 07:25 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. మిర్చి సినిమాలో కొరటాల శివ ప్రభాస్ ను కొత్తగా చూపించాడని ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు సైతం కమర్షియల్ గా సక్సెస్ గా సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి.
వరుస విజయాల వల్ల కొరటాల శివ రాజమౌళి రేంజ్ ఉన్న దర్శకుడు అని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో కొరటాల శివ ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 40 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్ ను కొరటాల శివ అమ్మేయనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సైతం కొరటాల శివపై కాన్ఫిడెన్స్ ను కోల్పోయారు.
ఆచార్య బిజినెస్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం కొరటాల శివ కెరీర్ కు ఒక విధంగా మైనస్ అయిందని చెప్పవచ్చు. కొరటాల శివను చూసి టాలీవుడ్ డైరెక్టర్లు ఈ విషయంలో మారాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి రామ్ చరణ్ ఆచార్య నష్టాల భర్తీ కోసం రూ.25 కోట్లు వెనక్కిచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కొరటాల శివ స్పందిస్తే మాత్రమే ఈ విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఆచార్య ఫ్లాపైనా కొరటాల శివ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా భారీస్థాయిలో ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తర్వాత సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా సెకండాఫ్ కథలో కీలక మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.