Mehreen Marriage: అతని వల్లే మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్?

  • July 5, 2021 / 11:54 AM IST

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ నిన్న హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ భిష్ణోయ్ మనవడు భవ్య భిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే మెహ్రీన్ చేసిన ప్రకటన గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సీనియర్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ వచ్చిందని అందుకే మెహ్రీన్ బ్రేకప్ చేసుకుందని వార్తలు వస్తుండటం గమనార్హం. అయితే కొన్ని రోజుల క్రితమే మెహ్రీన్ సీనియర్ హీరో సినిమాలో నటించడం లేదని స్పష్టతనిచ్చారు.

అందువల్ల సీనియర్ హీరో వల్ల మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ అయినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం అయితే లేదని వ్యక్తిగత కారణాల వల్లే మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతంలో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని చెప్పిన మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ కావడంతో సినిమా ఆఫర్లతో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్ల కొరత ఉన్న నేపథ్యంలో మెహ్రీన్ మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

యంగ్ హీరోలకు మాత్రమే జోడీగా నటిస్తూ మెహ్రీన్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మెహ్రీన్ ఎంచుకుంటున్నారు. గతంలో కొంతమంది హీరోయిన్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకోగా మెహ్రీన్ కూడా ఆ జాబితాలో చేరడం గమానార్హం. మెహ్రీన్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడానికి బలమైన కారణమే ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus