Chiranjeevi: అలా జరిగితే చిరంజీవి సినిమాలకు నష్టమేనా?
July 18, 2022 / 06:01 PM IST
|Follow Us
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ ఉన్న స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరని చెప్పవచ్చు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే చిరంజీవి నటించిన మూడు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల కానుంది.
వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. భోళా శంకర్ సినిమా కూడా 2023 సంవత్సరం శివరాత్రి లేదా 2023 సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఒక స్టార్ హీరో సినిమాలు ఇంత తక్కువ గ్యాప్ లో థియేటర్లలో విడుదల కావడం ఈ మధ్య కాలంలో జరగలేదు. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు నెల రోజుల గ్యాప్ లో రిలీజ్ కావడంతో ఆచార్య సినిమాకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది.
మెగాస్టార్ తన సినిమాల విషయంలో అదే తప్పును రిపీట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఒక సినిమాకు మరో సినిమాకు కనీసం 4 నుంచి 5 నెలల గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. చిరంజీవి ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు.
ఆచార్య సినిమా ఫ్లాపైనా చిరంజీవి రెమ్యునరేషన్ ఏ మాత్రం తగ్గలేదు. సీనియర్ స్టార్ హీరోలలో ప్రస్తుతం మరే స్టార్ హీరో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకోవడం లేదు. చిరంజీవి ప్రస్తుతం వేగంగా సినిమాలలో నటించడంపై దృష్టి పెడుతున్నారు. కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న చిరంజీవి మరో నాలుగేళ్ల పాటు సినిమాలతో బిజీగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని బోగట్టా.