Kiara Advani: ”కార్ డోర్ కూడా తీసుకోలేవా..?”

  • July 8, 2021 / 12:11 PM IST

‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది కియారా అద్వానీ. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో కియారా నిరాశ చెందింది. ఆ తరువాత తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో హిట్ అందుకుంది. ‘కబీర్ సింగ్’ సినిమాతో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గానే బికినీ షోతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లింది కియారా. అక్కడ ఆమె కారు డోర్ ని ఓ వృద్ధుడు తెరిచి ఆమెకి సెల్యూట్ చేశాడు. అప్పుడు ఆమె తాపీగా కారు దిగి భవంతిలోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు కియారాపై మండిపడుతున్నారు.కార్ డోర్ కూడా తీసుకోవడం చేత కాదా అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. తామేదో గొప్పవాళ్లమని ఊహించుకునే సెలబ్రిటీలు ఇలా వయసు మీద పడ్డ ముసలి వాళ్లతో ఇలాంటి పనులు చేయించుకోవడం సిగ్గు చేటు అంటూ విమర్శిస్తున్నారు.

తండ్రి కంటే వయసులో పెద్దవాడిలా కనిపిస్తున్నాడని.. అతడితో ఇలా చేయించడం నిజంగా బాధేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా… కియారా చాలా రోజులుగా సిద్ధార్థ్ తో చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట ‘షేర్ షా’ అనే సినిమాలో నటిస్తున్నారు.


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus