సోనూసూద్ ను తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు.. అలా చేయడంతో?

  • February 27, 2023 / 07:45 PM IST

మన దేశంలో సేవా కార్యక్రమాల ద్వారా రియల్ హీరోగా పేరు సంపాదించుకున్న వ్యక్తులలో సోనూసూద్ ఒకరు. లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. తాజాగా సోనూసూద్ కార్మికుడికి సినిమా ఛాన్స్ ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఆయన గొప్ప మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటుక బట్టీ కార్మికుడికి సోనూసూద్ మూవీ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం సోనూసూద్ ఫతేహ్ అనే మూవీలో నటిస్తున్నారు.

అమర్ జీత్ జైకర్ అనే వ్యక్తి బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ కు చెందిన యువకుడు. ఇతనికి పాటలు అంటే ప్రాణం. బాలీవుడ్ పాటలను ఎంతో ఇష్టంగా పాడే అమర్ జీత్ ఆ పాటలకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసేవారు. ఆ పాటల వల్ల అతనిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరిగింది. అతను పాడిన పాటలు అతని జీవితాన్ని సైతం మార్చేశాయి. తాజాగా అమర్ జీత్ దిల్ దే దియా హై అనే సాంగ్ ను అద్భుతంగా పాడారు.

ఈ పాటకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఒక మిలియన్ కంటే ఎక్కువమంది ఈ వీడియోను చూడటం గమనార్హం. ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సోనూసూద్ ఈ వీడియోను రీట్వీట్ చేయడం జరిగింది. అతని టాలెంట్ కు ఆశ్చర్యపోయిన సోనూసూద్ అతని ఫోన్ నంబర్ ను తెలుసుకుని మాట్లాడారు. ఆ తర్వాత సోనూసూద్ ఆ కార్మికునికి తన సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది.

సినిమాలో పాట పాడే ఛాన్స్ దక్కడంతో అమర్ జీత్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. త్వరలోనే ఈ సాంగ్ రికార్డింగ్ జరగనుందని బోగట్టా. సోనూ ఎంతోమందికి తన వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సోనూసూద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus