Venkatesh: వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్ పై నెటిజన్ల రియాక్షన్!

  • November 11, 2021 / 03:44 PM IST

సమంత-నాగచైతన్య తమ డివోర్స్ విషయాన్ని అనౌన్స్ చేసి నెల రోజులవుతున్నా.. ఇప్పటికీ ఏదొక రూపంలో ఆ వార్త వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో సీనియర్ హీరో వెంకటేష్ తన సోషల్ మీడియా వాల్ పై పెడుతున్న కొన్ని కొటేషన్స్ జనాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రేమ, బంధం, నమ్మకం వంటి విషయాలపై తన అభిప్రాయం చెబుతూ వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు వెంకటేష్. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నమ్మకం అనే విషయంపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

”నిన్ను ఇష్టపడే వారిని ఎప్పుడూ దూరం పెట్టకు. నీ అవసరం ఉన్న వారికి ఎప్పుడూ బిజీ అని చెప్పకు. నిన్ను నిజంగా నమ్మేవారిని అస్సలు మోసం చేయకు. నిన్ను గుర్తుంచుకునే వారినెప్పుడూ మరచిపోకు” అంటూ కొటేషన్ షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. వెంకీ పోస్ట్ చేస్తోన్న ఈ కొటేషన్స్ అన్నీ కూడా చైతు, సమంతల విడాకుల గురించేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తున్నారు.

అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ కామెడీ ఎంటర్టైనర్ లో వరుణ్ తేజ్ మరో హీరోగా కనిపించనున్నాడు. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఎఫ్2’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus