Anasuya: మేకప్ లేకుండా ఫోటో షేర్ చేసిన అనసూయ.. అలా కామెంట్స్ చేస్తున్న నేటిజన్స్!
April 5, 2023 / 05:17 PM IST
|Follow Us
బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరస సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈమె పూర్తిగా బుల్లితెరకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లో అంటూ అనసూయ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన తర్వాత అనసూయలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉండే అనసూయ ఈ మధ్యకాలంలో పూర్తిగా గ్లామరస్ ఫోటోలకు దూరంగా ఉంటున్నారని చెప్పాలి అంతేకాకుండా తన గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసిన వారి పట్ల కూడా ఈమె పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. ఈ విషయం గురించి తాజాగా ఈమె సమాధానం చెబుతూ తనని ట్రోల్ చేసే వారిని చక్కదిద్దడం కంటే తనకు ఇంకా చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటూ సమాధానం చెప్పారు.
అయితే ఈమె ఇలా సమాధానం చెప్పారో లేదో వెంటనే అనసూయ (Anasuya) గురించి మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి.అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా మేకప్ లేకుండా క్లోజప్ షాట్ లో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవల్ అని క్యాప్షన్ పెట్టడమే కాకుండా నో ఫిల్టర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా షేర్ చేశారు.
ఇలా ఈ ఫోటోని షేర్ చేయడంతో ఎంతోమంది ఈ ఫోటో పై స్పందిస్తూ తనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉన్నావు నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం యధావిధిగా ఈ ఫోటో పై ట్రోల్స్ చేస్తున్నారు.చర్మంపై ముడతలు అన్నీ ఉన్నాయి అంటూ కొందరు కామెంట్లు చేయక మరికొందరైతే ఏకంగా మేకప్ లేకపోతే అమ్మమ్మ లాగా ఉన్నావు అనసూయ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లపై అనసూయ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.