Thaman: ఎంత మంది హీరోలకు ఫ్యాన్ వి.. తమన్ నువ్వు..!
February 3, 2023 / 10:32 AM IST
|Follow Us
‘నాని తర్వాత తమన్’ ఏంటి అనే డౌట్ మొదటి హెడ్డింగ్ చూశాక వచ్చింది అంటే.. రెండో హెడ్డింగ్ చూశాక మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నానో..! సినిమా వేడుకలు అంటేనే డబ్బా కొట్టుకోవడానికి అడ్డా. ఈ విషయం పై రాంగోపాల్ వర్మ చాలా సార్లు సెటైర్లు వేశాడు. కానీ ఎక్కడో మనలో ఉన్న సినిమా అభిమాని ఆ విషయాన్ని అంగీకరించలేడు. కానీ హీరో నానిని చూశాక వర్మ ఏసిన సెటైర్ నిజమేనేమో అనే అనుమానం ఎక్కడో మూలన కలుగుతుంది.
ఎందుకంటే అతను ఏ హీరో దగ్గరగా ఉంటే ఆ హీరో అభిమానిని అని చెప్పుకుంటాడు కాబట్టి. చిరంజీవి దగ్గరుంటే’ నేను చిరంజీవి ఫ్యాన్’ అంటాడు. అదే నాగార్జున దగ్గరుంటే ‘నాగార్జున ఫ్యాన్’ అంటాడు. వెంకటేష్ దగ్గరుంటే ‘వెంకటేష్ ఫ్యాన్’ అంటాడు. కానీ నాని బాలకృష్ణ ఫ్యాన్ అనేది మాత్రం కన్ఫర్మ్. అది అతని సన్నిహితులు చెప్పిన మాట. సరే నాని విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక మన డప్పుల మాస్టర్ తమన్ వద్దకు వచ్చేద్దాం. సంగీత దర్శకుడు సినిమాకు ఎలాంటి సంగీతం అందించాడు..
పాటలు ఎలా వచ్చాయి..’ వంటివి చెప్పుకుంటారు. కానీ తమన్ మాత్రం తాను పనిచేసిన సినిమా ఈవెంట్లకు వెళ్ళాడు అంటే మాత్రం.. కచ్చితంగా ఆ హీరో అభిమానిని అని చెబుతాడు. అయితే ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. తమన్ అభిమాని అని చెప్పుకునేది స్టార్ హీరోలను మాత్రమే సుమీ. మీకు డౌన్ గా ఉంటే మేము కింద పోస్ట్ చేసే వీడియో చూడండి తమన్ తన మ్యూజిక్ విషయంలోనే కాదు నిజజీవితంలో కూడా ఎక్కువ డప్పులే వాడతాడు అనే క్లారిటీ మీకు వచ్చేస్తుంది.