Venkatesh: ఇంతకీ వెంకీ 75వ సినిమా ఏది.. కన్ఫ్యూజన్ షురూ..!

  • May 6, 2021 / 07:48 PM IST

‘నారప్ప’ సినిమాని తన 74 వ సినిమాగా అనౌన్స్ చేసాడు విక్టరీ వెంకటేష్. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు. మరో రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక వెంకీ 75 వ చిత్రంగా ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ అనుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న సినిమా.. పైగా వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి.. కచ్చితంగా ఇది మంచి విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి.. వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీకి ఇదే కరెక్ట్ అని వారు భావించారు.

అయితే అనుకోకుండా మధ్యలో ‘దృశ్యం 2’ కూడా మొదలైంది. రెండు షెడ్యూల్స్ లోనే ఈ చిత్రం షూటింగ్ మొత్తం ఫినిష్ అయ్యింది. దాంతో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిన వెంటనే అది కూడా ఇదే ఏడాది వెంకటేష్ నుండీ 3 సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతా బాగానే ఉంది.. కానీ ఇంతకీ అప్పుడు ‘వెంకటేష్ 75’ మూవీ ఏది అవుతుంది అనే కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏర్పడింది. ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి కచ్చితంగా దానిని బాగా ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. ‘దృశ్యం 2’ ని ఓటిటిలో విడుదల చేస్తాం అని కొన్ని రోజులు..కాదు థియేటర్లలోనే విడుదల చేస్తాం అని మరి కొన్నిరోజులు మేకర్స్ చెబుతున్నారు.

ఏది ఏమైనా అదే మొదట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట.అప్పుడు ‘నారప్ప’ వెంకటేష్ 75 వ చిత్రంగా విడుదలవుతుందా? అనేది పెద్ద ప్రశ్న. శ్రీకాంత్ అడ్డాలతో సినిమా అంటే చాలా రిస్క్ అని ‘నారప్ప’ ప్రాజెక్టు మొదలైనప్పుడే ఆయన అభిమానులు కంగారు పడ్డారు.కాకపోతే అది 74వ సినిమా కాబట్టి.. లైట్ తీసుకున్నట్టు కామెంట్స్ చేశారు.కానీ ‘నారప్ప’ వెంకటేష్ 75వ సినిమాగా విడుదలైతే ‘వెంకీ 50వ చిత్రం ‘వాసు’ ఎలా బిస్కెట్ అయినట్టే ఇది కూడా బిస్కెట్ అవుతుందేమో అని వారు కంగారు పడుతున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus