Cheppalani Undi Movie: ‘చెప్పాలని ఉంది’ గురించి ఆసక్తికర విషయం!

  • December 8, 2022 / 05:38 PM IST

సినిమాల కోసం సెట్స్‌ క్రియేట్‌ చేయడం చూశాం. అదిరిపోయే సెట్స్‌ వేసి సినిమాలు చేస్తుంటారు. అయితే సినిమా కోసం భాష క్రియేట్‌ చేస్తే.. ఇలాంటి ఆలోచన గతంలో ఓ పెద్ద సినిమా చేసింది. అదే ‘బాహుబలి’. అందులో ‘కిలికి’ భాషను తయారు చేశారు. ప్రముఖ తమిళ రచయిత మదన్‌ కార్కి ఆ భాషను తయారు చేశారు. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమా సినిమా కోసం భాషను క్రియేట్‌ చేసింది. ‘చెప్పాలని ఉంది’ అంటూ త్వరలో వస్తున్న తమిళ సినిమాలోనే ఈ భాష వినిపిస్తుంది.

పరాయి భాషను గౌరవిద్దాం.. మాతృభాషను ప్రేమిద్దాం అనే కాన్సెప్ట్‌తో ‘చెప్పాలని ఉంది’ సినిమాను రూపొందించారు. యష్‌ పూరి కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ఈ సినిమాను నిర్మించింది. అరుణ్‌ భారతి.ఎల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టెఫీ పటేల్‌ నాయిక. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో జర్నలిస్ట్‌గా కనిపిస్తాడు. అయితే మధ్య మధ్యలో వేరే భాషలో మాట్లాడుతుంటాడు. అది ఎవరికీ అర్థం కాదట.

అలా మాట్లాడటం వల్ల హీరో కొన్ని సమస్యలు ఎదుర్కొంటాడట. ఈ క్రమంలో తన అనుకునేవాళ్లంతా దూరమవుతారట. మరి ఆ వేరే భాష ఎందుకు వచ్చింది? దాని వల్ల ఎదురైన సమస్యలే ‘చెప్పాలని ఉంది’ సినిమా అని చెప్పాడు హీరో యశ్‌. ఆ భాషను ఏదో మాట్లాడేయకుండా.. కొత్తగా క్రియేట్‌ చేశారట. కొరియన్‌ భాష శైలిలో ఓ కొత్త భాషని సృష్టించారట. అయితే ఆ భాష మనవాళ్లకు అర్థమవుతుందా..

అంటే అర్థమయ్యేలా సినిమాలో పెట్టాం అని చెబుతున్నారు. ఆ భాష నేర్చుకోవడానికి యశ్‌కి 15రోజులు పట్టిందట. మరి ఆ భాష థియేటర్‌లో ఎంత సందడి చేస్తుందో చూడాలి. అన్నట్లు యశ్‌ది మన హైదరాబాదే. మొదట్లో క్రికెటర్‌ కావాలనుకున్న యశ్‌.. హైదరాబాద్‌ తరపున రంజీ ట్రోఫీ జట్టు ప్రాబబుల్స్‌లో చోటు కూడా దక్కించుకున్నాడట. కొన్ని కారణాల వల్ల ఆటకు దూరమై.. ఇప్పుడు సినిమాల్లో హీరో అయ్యాడు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus