ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ కొత్త సభ్యులు వీరే
August 12, 2017 / 01:59 PM IST
|Follow Us
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చీఫ్ పదవి నుంచి పహ్లాజ్ నిహలానీని తొలిగించిన 24 గంటల్లోనే కొత్త చీఫ్ ని ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో యాడ్ నిపుణులు, జాతీయ అవార్డు గెలుచుకున్న గీతరచయిత, తారే జమీన్ పర్, భాగ్ మిల్ఖా భాగ్, నీరజ్ వంటి చిత్రాలకు పనిచేసిన ప్రసూన్ జోషి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. 2015 జనవరి 19న పహ్లాజ్ నిహలానీ సీబీఎఫ్సీ చీఫ్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల పదవీకాలంలో ఆయన పలు వివాదాలు ఎదుర్కొన్నారు. అశోక్ పండిట్‌తో సహా పలువురు బోర్డు సభ్యల పట్ల ఆయన నియంతృత్వ ధోరణలో వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
నిర్మాతలు, ప్రేక్షకులు నిరుత్సాహానికి లోనైన సందర్భాలున్నాయి. దీంతో అతన్ని తొలగించి ప్రసూన్ జోషీని కేంద్రం నియమించింది. జోషీ నేతృత్వంలోని కొత్త బోర్డు సభ్యులను ప్రకటించింది. నూతనసభ్యుల్లో నటి గౌతమి, నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, హీరోయిన్ విద్యాబాలన్, అలాగే బీజేపీ నేత వాణి త్రిపాఠి ఉన్నారు. వీరితో పాటు నరేంద్ర కోహ్లి, నరేశ్ చంద్రలాల్, నీల్ హెర్బర్ట్, వివేక్ అగ్నిహోత్రి, వామన్ కేంద్ర, టీఎస్ నాగభరణ, రమేశ్ పతంగి, మిహిర్ భూటాలు సినిమాలకు సర్టిఫికెట్స్ ఇవ్వడంలో భాగం పంచుకోనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.