Chiranjeevi, Balakrishna: నైజాంలో రేట్ల పెంపు.. ఆ సినిమాలకు లాభాలు తగ్గనున్నాయా?
November 29, 2022 / 12:48 PM IST
|Follow Us
చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల కానున్నాయి. ఒకే బ్యానర్ లో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కావడం ఈ రెండు సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురుకావడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కొత్త కష్టం వచ్చిందని సమాచారం. నైజాంలోని థియేటర్ల ఓనర్లు థియేటర్ల రెంట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
థియేటర్ల ఓనర్లు ఈ దిశగా అడుగులు వేస్తే ఆ ప్రభావం మొదట మైత్రీ నిర్మాతల సినిమాలపైనే పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ల రెంట్లు పెరిగితే మాత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యే సినిమాలు కలెక్షన్ల విషయంలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. నైజాంలో థియేటర్ల రెంట్ల రేట్ల పెంపు వెనుక ఒక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. థియేటర్ల రెంట్లు పెంచితే మైత్రీ నిర్మాతలు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.
మైత్రీ నిర్మాతలు నైజాంలో సొంతంగా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధమైన సమయంలోనే థియేటర్ల రెంట్లు పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో రెంట్ల పెంపు ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ సక్సెస్ రేట్ 10 నుంచి 12 శాతం ఉండటం, ప్రేక్షకులకు థియేటర్లలో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపకపోవడం, ఈ తరహా పరిస్థితులు ఉన్న సమయంలో థియేటర్ల రెంట్లు పెంచితే నిర్మాతలపై అదనపు భారం పెరుగుతుంది.
ఈ వివాదం విషయంలో చిరంజీవి, బాలయ్య జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కావాలని ఈ విధంగా చేస్తున్నారని తెలిస్తే మాత్రం ఆ వ్యక్తికి వ్యతిరేకంగా అభిమానులు వ్యవహరించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో ఎన్నో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.