బిగ్‌బాస్‌లో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటో చూపిస్తా అంటూ నాగార్జున ఆదివారం ఓ జంబలకిడిపంబ టాస్క్ ఇచ్చారు. అమ్మాయిల్ని అబ్బాయిలుగాను, మగాళ్లను ఆడాళ్లగాను వేషాలు వేయించి వారితో డ్యాన్స్‌లు, యాక్టింగ్‌లు చేయించారు. ఇంతవరకు బాగుంది కానీ… అసలు ఇది ఏ విధంగా జెండర్ ఈక్వాలిటీ అవుతుందో బిగ్‌బాసే చెప్పాలి. జంబలకిడిపంబ సినిమాను మరోసారి చూపించి… ఈక్వాలిటీ నిరూపించడం ఎలా అవుతుందో మరి.
లక్ష్ (లాస్య), మెహబూబా (మెహబూబ్)తో ‘గోంగూర తోటకా కాపు కాసే…’ పాటకు స్టెప్పులేయించారు. ‘చక్కెర చిన్నోడా…’ పాటకు మున్నా (మోనాల్), అఖిల (అఖిల్) డ్యాన్స్ వేశారు. గంగులు (గంగవ్వ), కుమారి (కుమార్ సాయి) కలసి ‘ముత్యాలు వస్తావా..’ పాటకు అలరించారు. ఆర్య (ఆరియానా), సోనల్ (సోహైల్) ‘బాస్ ఈజ్ బ్యాక్..’ పాటకు నర్తించారు. అభిజీత్‌శ్రీ (అభిజీత్), హరి (హారిక) కలసి ‘సామజవరగమన..’ పాటకు స్టెప్పులేశారు.
అవని (అవినాష్), హరి (హారిక) చేసిన ‘ఖుషి’ నడము సీన్ స్కిట్ వేశారు. సుజీత్ (సుజాత), రజనీ (అమ్మ రాజశేఖర్) చేసిన ‘చూడాలని ఉంది’ స్కిట్ చేశారు. ‘అతడు’ సినిమాలోని మహేశ్‌బాబు – పూరి సీన్‌ను దేవ్ (దివి), నళిని (నోయల్) చేశారు. పాటల్లో ఆరియానా – సోహైల్ పెయిర్‌కు మంచి మార్కులు పడ్డాయి. సీన్‌లో అమ్మ రాజశేఖర్ – సుజాత గెలిచారు. అయితే ఇదంతా అక్కడ జరిగింది.
ఈ మొత్తం డ్యాన్స్‌లు, స్కిట్‌లు అయిపోయాక ‘కష్టాలు తెలిస్తే కంపేర్ చేయరు అనుకుంటున్నా’ అంటూ నాగార్జున కంక్లూజన్ ఇచ్చారు. అసలు ఇందులో కష్టాలు తెలిసేంతగా ఏం జరిగిందని. డ్రెస్‌లు మార్చుకున్నారు. కొందరు ఓవరాక్షన్ చేశారు. ఇందులో జనాలకు కొంచెం వినోదం, కొంచెం చిరాకు తప్ప ఇంకేం మిగలలేదు. అదేదో మహిళ కష్టాలు అబ్బాయిలకు తెలిసాయి అనేలా కలరింగ్ ఇచ్చారు.
అసలు ఇంట్లో జెండర్ ఈక్వాలిటీ అనే టాపిక్ ఎప్పుడు వచ్చింది.. ఇప్పుడు నాగార్జున క్లియర్ చేయడానికి. బిగ్‌బాస్… ఏం జరుగుతోంది. టాస్క్‌లు ట్రాక్ తప్పుతున్నాయ్. అన్నట్లు నాగ్ ఆఖరులో ‘మీ అందరినీ చూశాక నాకేం కలలు వస్తాయో’ అన్నాడు. ఆయనకేమో కానీ… చూసిన జనాలకు మాత్రం పీడ కలలు వచ్చేలా ఉన్నాయ్ రాత్రి కొంతమంది హౌస్‌మేట్స్ వేషాలు.
Most Recommended Video
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!