Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్.. కారణమిదే..?

  • June 6, 2021 / 10:12 PM IST

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఆర్య సినిమాను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఆర్య సినిమా బన్నీకి స్టైలిష్ స్టార్ గా గుర్తింపును తెస్తే సుకుమార్ టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసింది. అయితే ఆర్య సినిమా అంచనాలను అందుకుంటే ఆర్య2 సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. కథనంలోని చిన్నచిన్న లోపాలు ఆర్య2 సినిమా పాలిట శాపంగా మారాయి.

పుష్ప సినిమా విషయంలో కూడా ఆర్య సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని పుష్ప పార్ట్ 1 హిట్టైనా పార్ట్ 2 అంచనాలను అందుకోలేదేమోనని బన్నీ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతుండటం గమనార్హం. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 90 శాతం షూటింగ్ పూర్తి కావడంతో ఆగష్టు 13వ తేదీనే పుష్ప మొదటి భాగాన్ని రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగష్టు నాటికి దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే.

బన్నీకి జోడీగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పుష్ప పార్ట్ 2లో బన్నీ స్టైలిష్ లుక్ లో కనిపిస్తారని ఊరమాస్ లుక్ తొలి భాగానికే పరిమితం అవుతుందని సమాచారం. సుకుమార్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లు కావడంతో పుష్ప ఆడియో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప మేకర్స్ ను సైతం ఆర్య సెంటిమెంట్ టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus