నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన జెర్సీ మూడేళ్ల క్రితం తెలుగులో విడుదలై అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. నాని కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో జెర్సీ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు ఈ సినిమా హిందీలో అదే టైటిల్ తో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కి ఈ నెల 22వ తేదీన రిలీజవుతోంది.
ఈ నెల 14వ తేదీనే జెర్సీ రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల, కేజీఎఫ్2 సినిమా రిలీజ్ వల్ల జెర్సీ రిలీజ్ డేట్ మారింది. ఈ సినిమా కాపీరైట్ సమస్యల్లో చిక్కుకోగా ఈ మూవీ స్టోరీ తనదేనని రూపేశ్ జైస్వాల్ అనే హిందీ రచయిత కోర్టు మెట్లెక్కారు. తాను ది వాల్ పేరుతో ఈ కథను 2007 సంవత్సరంలో ఫిల్మ్ రైటర్ అసోసియేషన్ లో రిజిష్టర్ చేసుకున్నానని రూపేశ్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. ప్రతివాదులు అక్రమ పద్ధతిలో తన కథను సంపాదించారని ఆయన అన్నారు.
కథ, కథనంలో ఎన్నో మార్పులు చేసి సినిమాను నిర్మించారని ఇలా చేయడం ద్వారా ప్రతివాదులు డబ్బు సంపాదిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ విధంగా చేయడం వల్ల తనకు ఆర్థిక నష్టం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ఆరోపణల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమా హిందీలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లోనే తెరకెక్కింది. జెర్సీ సినిమాకు రచయిత, దర్శకుడు ఒకరే కావడం గమనార్హం.
ఈ పిటిషన్ విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గతంలో కూడా పలు సినిమాలు కాపీరైట్ వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హిందీ రచయిత కథను గౌతమ్ తిన్ననూరి కాపీ కొట్టడం అసాధ్యమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమేనని ప్రూవ్ అయితే గౌతమ్ కెరీర్ పై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!