Sharwanand: శర్వా ఫ్యాన్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ఇదే!

  • March 3, 2022 / 06:44 PM IST

మరికొన్ని గంటల్లో థియేటర్లలో శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ కానుంది. అమెరికాలో 300 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శర్వానంద్ కు సైతం ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే. అయితే శర్వానంద్ హీరోగా తెరకెక్కి గతంలో మార్చి నెలలో విడుదలైన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.

ఆ సెంటిమెంట్ వల్ల శర్వానంద్ ఫ్యాన్స్ ఆడవాళ్లు మీకు జోహార్లు రిజల్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. శర్వానంద్, అల్లరి నరేష్ తో కలిసి నటించిన నువ్వా నేనా సినిమా 2012 సంవత్సరం మార్చి నెల 16వ తేదీన విడుదలైంది. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా తెరకెక్కి 2015 సంవత్సరం మార్చి 6వ తేదీన రాజాధిరాజా అనే సినిమా విడుదలైంది.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత గతేడాది మార్చి నెల 11వ తేదీన శ్రీకారం రిలీజైంది. అదే రోజున జాతిరత్నాలు, గాలిసంపత్ సినిమాలు విడుదల కాగా జాతిరత్నాలు సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో శ్రీకారం మూవీ డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం నష్టపోయారు. మహానుభావుడు సినిమా తర్వాత సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో సక్సెస్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. శర్వానంద్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus