టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఏ స్థాయిలో గుర్తింపు ఉందో స్టార్ డైరెక్టర్లకు అదే స్థాయిలో గుర్తింపు ఉంది. అయితే సినిమాసినిమాకు హీరోలతో పోల్చి చూస్తే దర్శకులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. హీరో నటించిన ఒక సినిమా ఫ్లాపైనా హీరోను నిందించని అభిమానులు దర్శకులపై మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలోని ఏ సన్నివేశం తమకు నచ్చకపోయినా దర్శకులను ట్రోల్ చేస్తున్నారు. కొందరు స్టార్ హీరోలు కొత్త ప్రాజెక్ట్ లను దర్శకులను ప్రకటించిన వెంటనే కొందరు అభిమానులు దర్శకులను ట్రోల్ చేస్తున్నారు.
హిట్టైతే హీరో కారణమంటూ ఫ్లాపైతే డైరెక్టర్ కారణమంటూ కామెంట్లు చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్టైనా ఆయన వేర్వేరు విషయాలకు సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా విషయంలో తీవ్రస్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీ మొదలుకావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే మారుతి కొంతమంది నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వినయ విధేయ రామ, జయ జానకి నాయక సినిమాల విషయంలో బోయపాటి శ్రీను విమర్శలను ఎదుర్కొన్నారు. 1 నేనొక్కడినే సినిమా ఫ్లాప్ కావడంతో దర్శకుడు సుకుమార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. 2.O సినిమా విషయంలో శంకర్ సైతం విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ విమర్శల వల్ల స్టార్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్ మొదలైంది.
నెటిజన్లు ట్రోల్ చేయడం వల్ల దర్శకులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. సినిమా ఫ్లాప్ కు ఎన్నో కారణాలు ఉంటాయని సినిమా ఫ్లాపైనంత మాత్రాన దర్శకులను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నెగిటివ్ ట్రోల్స్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లను మానసికంగా కృంగదీస్తున్నాయి. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన డైరెక్టర్లను టార్గెట్ చెయ్యడం సరి కాదు.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!