కొత్త మలుపు తీసుకున్న రాజ్ తరుణ్ యాక్సిడెంట్ వ్యవహారం
August 23, 2019 / 01:29 PM IST
|Follow Us
ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద యువ హీరో రాజ్ తరుణ్ కారుకి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుండీ క్షేమంగా బయటపడ్డానని రాజ్ తరుణ్ తెలిపాడు. ఇక ప్రమాద జరిగాక రాజ్ తరుణ్ పారిపోయిన దృశ్యాలు సిసి టివి ద్వారా బయటకొచ్చాయని పోలీసులు తెలిపారు. ఈ విషయం అనేక కథనాలు బయటకొచ్చాయి. ప్రమాదం జరిగిన తర్వాత… రాజ్ తరుణ్ వెంటనే స్పందించ లేదు. చాలా గ్యాప్ తర్వాత స్పందించాడు. కేవలం భయంతో మాత్రమే పరిగెత్తానని ఓ లేక ద్వారా తెలిపాడు.
అయితే అనుకోకుండా ఈ సంఘటన ఊహించని మలుపు తీసుకుంది . కార్తీక్ అనే వ్యక్తి రాజ్ తరుణ్ ఆడియో, వీడియో క్లిప్ లని బయటపెట్టాడు. ఈ వీడియోలో రాజ్ తరుణ్ మద్యం సేవించి ఉన్నాడని కార్తీక్ పేర్కొన్నాడు. పారిపోతున్న రాజ్ తరుణ్ ని పట్టుకున్నప్పుడు… ‘నేను మద్యం సేవించి ఉన్నానని ఈ విషయం బయటకు తెలియకూడదని’ కార్తీక్ తో బేరసారాలు ఆడే ప్రయత్నం చేశాడంటూ తెలిపాడు. దీనివల్ల రాజ్ తరుణ్ కెరీర్ పై మచ్చ పడే ప్రమాదం ఉందని.. ఈ విషయం బయటకి తెలీకుండా ఉంచితే 3 లక్షల డబ్బు ఇస్తానని’ రాజా తరుణ్ చెప్పాడట. తనతో బేరం కుదుర్చుకునేందు రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర, ఓ మహిళ కూడా రంగంలోకి దిగినట్లు కార్తీక్ తెలిపాడు. ఆడియో, వీడియోలు డిలీట్ చేయాలని బెదిరించినట్లు కూడా కార్తీక్ ఆరోపణలు వ్యక్తం చేశాడు. ఈ విషయం పై ఓ మీడియా సంస్థ లో రాజా రవీంద్ర, కార్తీక్ మధ్య వాదన కూడా జరిగింది. రాజా రవీంద్ర మాట్లాడుతూ… “అతను ఎవరో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు అతనికి నేనెలా ఫోన్ చేస్తాను. అతడే నాకు కాల్ చేశాడు. కార్తీక్ రూ5 లక్షలు డిమాండ్ చేస్తూ రాజ్ తరుణ్ ని బ్లాక్ మెయిల్ చేసాడు” అంటూ చెప్పుకొచ్చాడు. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని రాజా రవీంద్ర కార్తీక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాడు. కార్తీక్ మొత్తం అబద్దాలు చెబుతున్నాడని… ఈ విషయంలో మేము న్యాయపరంగా ముందుకెళ్ళబోతున్నట్టు రాజా రవీంద్ర కంప్లైంట్ లో పేర్కొన్నాడు.