Indian 2 Movie: శంకర్ ‘ఇండియన్2’ ఇష్యు పై లేటెస్ట్ అప్డేట్..!
July 1, 2021 / 08:16 AM IST
|Follow Us
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ పక్క ‘ఇండియన్ 2’ ఇష్యుతో సతమతమవుతూనే మరోపక్క తన కూతురు ఐశ్వర్య పెళ్లి పనుల్లో కూడా హడవిడిగా గడుపుతూ వచ్చాడు. ఎట్టకేలకు తన కూతురు పెళ్లి చేసేసాడు. శంకర్ కి కొంత రిలీఫ్ దొరికింది. అయితే ‘లైకా ప్రొడక్షన్స్’ నిర్మాతలకు ‘ఇండియన్2’ ఇష్యు అలాగే ఉంది. ఈ కేసు పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. కానీ శంకర్ కు తీర్పు పాజిటివ్ గా రావాలని..
ఆయన త్వరగా ఈ ఇష్యు నుండీ బయటపడాలని రాంచరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత శంకర్ డైరెక్షన్లో సినిమా చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి. ఈ ప్రాజెక్టుని దిల్ రాజు పాన్ ఇండియా లెవెల్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సరే ఇంతకీ కేసు విషయం పై లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని ఆరా తీయగా.. తమిళనాడు హై కోర్టు ఇండియన్ 2 ఇష్యు పై మాజీ సుప్రీం జడ్జి ఆర్.పనుమతిని మధ్య వర్తిగా నియమించడం జరిగిందట.
ఆయన స్టేట్మెంట్ అనంతరమే ఈ ఇష్యు పై ఒక తుది తీర్పు వెల్లడించడం జరిగిందని తెలుస్తుంది.మరి తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది అనే విషయం పై మాత్రం వివరాలు అందాల్సి ఉంది. శంకర్ పై ఫైన్ విధించే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో.