నెట్లో v6 న్యూస్ రీడర్ సావిత్రి పెళ్లి ఫోటోలు

  • October 27, 2016 / 01:30 PM IST

అచ్చమైన తెలంగాణ ఆడపడుచుగా v6 ఛానల్ లో బిత్తిరి సత్తి తో కలిసి తీన్మార్ సావిత్రి గా నవ్వించే జ్యోతి గంగూలీ పెళ్లిచేసుకుంది. మీడియాకు దూరంగా, అతి సింపుల్ గా జరిగిన ఆమె వివాహ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజామాబాద్ జిల్లాలోని నాగంపేట్ కు చెందిన జ్యోతి కొన్నేళ్ల క్రితం  హైదరాబాద్ కి బిఎస్సి నర్సింగ్ చేద్దామని వచ్చింది. డిగ్రీ చదివే సమయంలో మీడియా రంగానికి ఆకర్షితురాలైన ఆమె న్యూస్ రీడర్ గా అవతారమెత్తింది.

తన మాటల చాతుర్యంతో తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడంతో అవకాశాలు వెల్లువెత్తాయి. v6 ఛానల్ లో స్వచ్ఛమైన తెలంగాణ మాట్లాడే వీజే, యాంకర్, న్యూస్ రీడర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం రహస్యంగా కళ్యాణం చేసుకుని వార్తల్లో నిలిచింది. జ్యోతి గంగూలీకి ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus