Varalaxmi: కేరళ డ్రగ్స్ కేసులో వరలక్ష్మీకి నోటీసులు.. ఏమైందంటే?
August 29, 2023 / 05:50 PM IST
|Follow Us
వరలక్ష్మీ శరత్‌కుమార్.. డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విషయం ఏంటంటే.. ఆమెకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సంస్థ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. కేరళ డ్రగ్స్ కేసు విషయంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ని విచారణకి హాజరు కావాలని నోటీసులతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి మాజీ పీఏ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. అతని కోసమే వరలక్ష్మీని విచారణకు హాజరుకావాల్సిందిగా ఎన్.ఐ.ఏ సంస్థ ఆమెకు నోటీసులు పంపినట్టు స్పష్టమవుతుంది.
ఆగస్టు 18న కేరళలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాని ఎన్ఐఏ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.శ్రీ విఘ్నేష్ అనే పేరుతో ఉన్న ఫిషింగ్ బోట్ నుండి వారు 300 కేజీల హెరాయిన్, ఏకే 47 రైఫిల్, 17 రౌండ్ల బుల్లెట్లు, ఐదు 9 ఎంఎం పిస్టోల్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హెరాయిన్ విలువే దాదాపు రూ.2100 కోట్లు ఉంటుందని స్పష్టమవుతుంది. ఈ కేసులో ఆదిలింగంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.
వరలక్ష్మీ శరత్ కుమార్.. ఆదిలింగం బ్లాక్ మనీని.. సినిమాల్లో పెట్టుబడిగా పెడుతుందేమో అనే అనుమానంతో కూడా ఎన్ఐఏ అధికారులు ఆమెకు నోటీసులు పంపినట్టు టాక్ వినిపిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్..దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారుతున్న.. ఆమెపై ఇలాంటి నోటీసులు ఎలాంటి ప్రభావం చూపుతాయి చూడాలి.