Nidhhi Agerwal: ‘హీరో’ మూవీ పై నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
January 11, 2022 / 10:02 PM IST
|Follow Us
కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘హీరో’.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ‘అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది.టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమా పై మంచి బజ్ ఉంది. ఇక ప్రమోషన్లలో హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొని ‘హీరో’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు మీ కోసం :
ప్ర. ‘హీరో’ లో ఛాన్స్ ఎలా వచ్చింది?
జ. శ్రీరామ్ ఆదిత్య గారు నన్ను అప్రోచ్ అయ్యి కథ చెప్పారు. అప్పటికే నేను ఇండస్ట్రీలో వింటూ ఉన్నాను.. ఇది ఒక మంచి కథ అని..! ఒక పక్క ఆఫ్ బీట్ మూవీలా అనిపించినప్పటికీ.. మరోపక్క కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి. సో అందుకే నేను వెంటనే ఓకే చేసేసాను.
ప్ర.ఓ పక్క మీకు పెద్ద సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. మరి కొత్త హీరో సరసన నటించడానికి ముఖ్యకారణం ఏంటి?
జ. నాకు అన్ని రకాల పాత్రలు చెయ్యాలని ఉంది. కొన్ని సినిమాలు మన ఇమేజ్ ను పక్కన పెట్టి చేసినప్పుడే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అని నేను నమ్ముతాను. ఈ సినిమాలో నాకు నటించే స్కోప్ ఉంది. అందుకే ఈ పాత్రని మిస్ చేసుకోకూడదని వెంటనే ఓకే చేశాను.
ప్ర.ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
జ. ఈ చిత్రంలో కూడా నేను డాక్టర్ పాత్రనే పోషిస్తున్నాను.’ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మరోసారి డాక్టర్ గా కనిపించబోతున్నాను. నా పాత్ర పేరు సుబ్బు. జగపతి బాబు గారు నా తండ్రి పాత్రని పోషిస్తున్నారు. నటనతో పాటు కామెడీకి కూడా స్కోప్ ఉన్న పాత్ర ఇది. సందర్భానుసారంగా కామెడీ వస్తుంది.
ప్ర.గల్లా అశోక్ తో మీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది?
జ. అది మీరే సినిమా చూసి చెప్పాలి. నేను ఎలా చెప్పగలను.
ప్ర.గల్లా అశోక్ తో మీ వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
జ.అతను కొత్త హీరో అయినప్పటికీ.. అతనిలో ఎటువంటి టెన్షన్ లేదు. చాలా ప్రిపేర్ అయ్యే సినిమాల్లోకి అడుగుపెట్టాడు అనిపించింది. నా ఫస్ట్ మూవీ టైములో నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ అశోక్ లో ఆ టెన్షన్ ఏమాత్రం కనిపించలేదు. అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. నాకు ఇలాంటి కో స్టార్ దొరకడం.. నాకు కంఫర్టబుల్ గానే అనిపించింది.
ప్ర. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు?
జ. కోవిడ్ లాక్ డౌన్ వల్ల నేను ఏమి చేయగలను. షూటింగ్స్ జరుగుతున్నాయి. తమిళ్ లో సినిమాలు చేశాను. హిందీలో కూడా త్వరలో చేయబోతున్నాను. సినిమాలు అన్నీ కోవిడ్ వల్ల పెండింగ్ లో ఉన్నాయి.
ప్ర.అశోక్ డెబ్యూ మూవీ కాబట్టి.. మీరు సీనియర్ అని ఏమైనా టిప్స్ అడిగాడా?
జ. యాక్టింగ్ వైజ్ అతను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతోనే ఎక్కువ డిస్కస్ చేసేవాడు. డ్యాన్స్ వైజ్ మాత్రం నన్ను కొన్ని టిప్స్ అడిగాడు అంతే.
ప్ర.దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాలో మీరు డాక్టర్ అని చెప్పగానే..సెంటిమెంట్ కొద్దీ ఓకే చెప్పేశారా?
జ. అలాంటిదేమి.. లేదు..! ఒకవేళ ‘హీరో’ కూడా మంచి ఫలితాన్ని అందిస్తే అప్పుడు సెంటిమెంట్ గా ఫీలవుతానేమో(నవ్వుతూ)
ప్ర.పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం ఎలా అనిపించింది. అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది?
జ. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా దర్శకుడు నా నుండీ ఎలాంటి నటనను ఆశిస్తున్నాడో అది ఇవ్వడమే నా బాధ్యతగా భావిస్తున్నాను. నాకు యాక్షన్ పాత్రలంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ‘హరిహర వీరమల్లు’ లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి.నా వరకు నేను చాలా ఇష్టంగా చేశాను. ఫస్ట్ హాఫ్ వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది.కోవిడ్ నిబంధనలను బట్టి బ్యాలన్స్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా కూల్‌గా వుంటారు. ఆయన సినిమాలో ఇంత పెద్ద రోల్ దొరుకుతుంది అని నేను ఊహించలేదు.నా కెరీర్లో ఇది బెస్ట్ రోల్. ఇది పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతుంది. మీ అందరినీ అలరిస్తుంది.
ప్ర. పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేశారు. నెక్స్ట్ ఏ స్టార్ హీరోతో చేయాలని ఆశపడుతున్నారు?
జ.అల్లు అర్జున్, చరణ్, ఎన్.టి.ఆర్ అందరూ మంచి నటులు. వాళ్ళతో పాటు కొత్త హీరోలతో కూడా చేయడానికి నేను రెడీ. పవన్ కళ్యాణ్ గారి సరసన మళ్ళీ నటించాలని ఉంది.(నవ్వుతూ)
ప్ర.మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అది మీకు ఎలా ఉపయోగపడుతుంది.సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను మీరు ఎలా తీసుకుంటారు?
జ. ఎస్.. నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. నేను హీరోయిన్ కాకముందే నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ వున్నారు. అందులో నేను పోస్ట్ చేసే ఫోటోలను బట్టి నేను ఏ పాత్రకు సరిపోతాను అనే విషయాన్ని దర్శకులు అంచనా వేసుకుని నన్ను సంప్రదిస్తూ ఉంటారు. ఇక ట్రోల్స్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే..!కానీ వాటిని లైట్ తీసుకుంటాను.
ప్ర. ఫైనల్ గా ‘హీరో’ గురించి ప్రేక్షకులకి ఏం చెబుతారు?
జ.’హీరో’ అనేది సంక్రాంతికి ఫర్ఫెక్ట్ మూవీ. కామెడీ, సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. లాగ్ లేకుండా ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది మూవీ. ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని ఆశిస్తున్నాను.