‘నాని’కి లైఫ్ ఇచ్చిన నిహారిక…

  • June 25, 2016 / 11:09 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడైన నాని, తన ప్రతీ సినిమాను చాల్ కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. అప్పట్లో ఒకే సారి రెండు సినిమాలు విడులా చేసే అంతగా వరుస సినిమాలు చేసిన నాని, అవి కాస్త మంచి ఫలితాలను ఇవ్వకపోవడంతో ఆచి తూచి అడుగులు వేస్తూ మంచి సినిమాలు చేస్తున్నాడు….భలే…భలే మగాడివోయ్ సినిమా సూపర్ హిట్ తరువాత నాని చేసిన “జెంటిల్ మన్” సైతం మంచి టాక్ ను తెచ్చుకుంది.

అదే క్రమంలో నానికి క్లాస్ ఫాలోయింగ్ తో పోలిస్తే, మాస్ ఫాలోయింగ్ కాస్త తక్కువ. అయితే ఈ వారం విడుదలయిన మెగా హీరోయిన ఒక మనసు సినిమా రిసల్ట్ పైనే నాని ఎన్నో అసలు పెట్టుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ అయితే నాని సినిమా డౌన్ అయిపోతుంది అని టెన్షన్ పడ్డ నానికి ‘ఒక మనసు’ ఫ్లాప్ కాస్త ఊరట కలిగించింది. అదే క్రమంలో నితిన్ ‘అ…ఆ’ సైతం దాదాపుగా క్లోస్ అయిపోవడంతో, అంతేకాకుండా మరో రెండు వారాల వరకూ పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో నాని జెంటిల్ మన్ కు ఇంకో రెండు వారాలు డోకా లేదు అనే చెప్పాలి. అయితే ఈ పరిణామాలను అన్నింటినీ గమనిస్తున్న ఇండస్ట్రీ వర్గాలు…నానిపై శెటైర్ల వర్షం కురిపిస్తున్నాయి. నిహారిక నెచురల్ స్టార్ నానీకి లైఫ్ లైన్ ఇచ్చింది అంటూ కామెంట్స్ సైతం చక్కెర్లు కొడుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus