Niharika: పిల్లలకు ఈ తరహా సంస్కృతిని నేర్పాలి.. నిహారిక కామెంట్స్ వైరల్!
August 6, 2024 / 11:09 AM IST
|Follow Us
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తూ సక్సెస్ సాధిస్తున్న నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు (Committee Kurrollu) సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిహారిక మాట్లాడుతూ ఈతరం అమ్మాయిలకు గౌరవం ఎంతో ముఖ్యమని అన్నారు. కొందరు అమ్మాయిలను అలుసుగా తీసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. నా ఉద్దేశంలో చదువును బట్టి జ్ఞానం రాదని నిహారిక కామెంట్లు చేశారు.
మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లను గౌరవించే వాళ్లు ఎవరినైనా గౌరవించగలరని నిహారిక తెలిపారు. తల్లీదండ్రులు తమ పిల్లలకు ఈ తరహా సంస్కృతిని నేర్పాలని ఆమె చెప్పుకొచ్చారు. నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నేను చాలా ఎమోషనల్ పర్సన్ అని ఆమె అన్నారు. నా ఎమోషన్స్ ను మాత్రం బయటపడనివ్వనని నిహారిక తెలిపారు.
నాకు ఎమోషనల్ సపోర్ట్ అంటే మా నాన్న మాత్రమేనని చాలామంది నమ్మకపోయినా నాన్న తన విషయంలో ఎమోషనల్ గా ఉండరని తాను ప్రేమించే వాళ్లను ఏమైనా అంటే ఊరుకోరని పేర్కొన్నారు. నాన్న తన ఎమోషన్స్ ను పక్కన పెట్టి మరీ నాకు మద్దతు ఇచ్చిన సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయని నిహారిక చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడూ కామెంట్స్ సెక్షన్ చూడనని ఆమె కామెంట్లు చేశారు.
కొత్త వ్యక్తులు ఇంటికి వచ్చిన సమయంలో సర్దుకుపోవాలని వదిన మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఆహ్వానించామని నిహారిక వెల్లడించారు. వదిన ఉత్తరాది అమ్మాయి కావడంతో తన అలవాట్లు భిన్నంగా ఉండేవని ఆమె పేర్కొన్నారు. నా ఉద్దేశంలో కొత్త వ్యక్తి మన ఇంటికి వచ్చిన సమయంలో రెండు అడుగులు వెనక్కి వేస్తే తప్పేం లేదని నిహారిక పేర్కొన్నారు. నేను, వదిన మంచి ఫ్రెండ్స్ అని నిహారిక చెప్పుకొచ్చారు.