మంచి కథతో రీలాంచ్ కావడానికి సన్నాహాల్లో నిహారిక

  • October 7, 2016 / 06:30 AM IST

వెండి తెరకు పరిచయమయ్యే తొలి సినిమా ఎవరికైనా పరీక్షలాంటిదే. ఆ పరీక్షలో మంచి మార్కులతో పాసయితే ఆనందానికి హద్దులుండవు. ఫెయిలయితే తర్వాతి ప్రాజక్ట్ పై మరింత టెన్షన్ ఉంటుంది. అదే పరిస్థితిలో ఉంది నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామకు తొలి చిత్రం నిరాశను మిగిల్చింది. ఆమె హీరోయిన్ గా నటించిన “ఒక మనసు” చిత్రం నటన పరంగా ప్రశంసలు దక్కినప్పటికీ, అపజయం పాలవడంతో డిప్రెషన్ లోకి వెళ్లింది.

ఆ బాధలోంచి బయటికి వచ్చిన మెగా డాటర్ ప్రస్తుతం కథలను వింటోంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తోంది. అందుకే తన పూర్తి సమయాన్ని స్క్రిప్ట్ లను వినేందుకే కేటాయించింది. యువ దర్శకులు చెప్పిన రెండు కథలు నిహారికకు నచ్చిందని సమాచారం. అయినా అంతకు మించి కథలు వస్తాయేమోనని ఎదురుచూస్తోందంట. అందుకే నోరు మెదపకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూడా కూతురిని మంచి సినిమాతో రీ లాంచ్ చేయాలనీ ప్రయత్నాల్లో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus