కొద్దిరోజులుగా మెగా డాటర్ నిహారిక పెళ్లిపై మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తుంది. నిహారికి పెళ్లిపై తండ్రి నాగబాబు స్పందించడం కూడా దీనికి కారణం. కొద్దిరోజుల క్రితం ఆయన నిహారికి, వరుణ్ పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నాను అన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది చివరి కల్లా నిహారిక పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా చెప్పడం జరిగింది. దీనితో మెగా డాటర్ నిహారిక పెళ్లి ఎప్పుడైనా జరగొచ్చనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు.
ఐతే నిహారిక పెళ్లి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. గుంటూరుకు చెందిన ఓ అబ్బాయిని నిహారిక పెళ్లి చేసుకోనుందట. అబ్బాయి వాళ్ళ నాన్న గవర్నమెంట్ అధికారి అని సమాచారం అందుతుంది. దీనిపై నేడు రేపు పూర్తి వివరాలు బయటికి వచ్చే సూచనలు కలవు. నేడు నిహారిక సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి గురించి ఓ హింట్ ఇవ్వడం జరిగింది. తను మిస్ స్టేటస్ ని కొట్టివేసి మిసెస్ స్టేటస్ పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టింది.
ఇవన్నీ గమనిస్తుంటే నిహారికకు పెళ్లి ఖాయమే అనే సంధేహం కలుగుతుంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక అమ్మాయి నిహారిక. ఒక మనసు సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రయాణం కొంత వరకు సాగింది. సరైన బ్రేక్ అయితే ఆమెకు రాలేదు. నిర్మాతగా కూడా నిహారిక కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించింది.
Most Recommended Video
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!