Nikki Galrani: సంజనా గల్రాని డ్రగ్స్ కేసు, జైలు శిక్ష.. పై నిక్కీ గల్రాని స్పందన..!
May 25, 2021 / 01:45 PM IST
|Follow Us
తెలుగులో ‘బుజ్జిగాడు’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి పలు సినిమాల్లో నటించిన సంజనా గల్రానీ అందరికీ సుపరిచితమే. ఆమె ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. అంతేకాదు 3 నెలల పాటు జైలుశిక్ష కూడా అనుభవించింది.మొత్తానికి బెయిల్ మంజూరవ్వడంతో కొద్దిరోజుల క్రితం విడుదలైంది. అటు తర్వాత ఈ విషయం గురించి అలాగే తన రహస్య వివాహం గురించి కూడా మీడియాతో మాట్లాడింది.ఇదిలా ఉండగా.. సంజన జైలు శిక్ష పై ఆమె చెల్లెలు, ప్రముఖ హీరోయిన్ అయిన నిక్కీ గల్రానీ మాత్రం స్పందించలేదు.
దీంతో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని చెన్నై మీడియా కోడై కూసింది. అయితే తాజాగా నిక్కీ తన మౌనం వీడి.. తన అక్క గురించి ఆమె జైలు శిక్ష గురించి స్పందించింది. ‘మా అక్క బెంగళూరులో నివసిస్తూ ఉంటుంది. నేను చెన్నై లో ఉంటాను. గతేడాది ఏర్పడిన లాక్ డౌన్ సమయంలో కూడా నేను చెన్నైలోనే ఉన్నాను.ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా నేను చెన్నైలోనే ఉన్నాను. ఈ కారణంతోనే మా అక్క కేసు గురించి నేను బయటకు వచ్చి మాట్లాడలేకపోయాను.
అయితే ఆ కేసు వల్ల మా బంధం మరింత బలంగా మారింది. మా ఫ్యామిలీ కూడా ఎమోషనల్ గా స్ట్రాంగ్ అయ్యింది.ఎటువంటి ఒత్తిడులు అయినా మేము ఎదుర్కోగలం అనే నమ్మకం వచ్చింది. సంజనా,నేను అక్కాచెల్లెళ్లుగా కాదు ఫ్రెండ్స్ లా పెరిగాము. ఎంతటి కష్టం వచ్చినా ఒకరికొకరం తోడుగా ఉంటాం. సంజనా కష్టాల్లో ఉన్న టైంలో కూడా నేను అండగా నిలబడ్డాను.మీ అందరికీ ఒక్క విషయం చెప్పదలచుకున్నాను. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది.” అంటూ చెప్పుకొచ్చింది నిక్కీ గల్రానీ.