20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జున రొమాంటిక్ ఫిల్మ్

  • October 7, 2016 / 05:47 AM IST

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జునకు మహిళల్లో ఫాలోయింగ్ పెంచిన చిత్రం నిన్నే పెళ్లాడతా. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ రొమాంటిక్ లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో టబు, నాగ్ కి పర్ఫెక్ట్ లవర్ గా నటించి మెప్పించింది. 1996 అక్టోబరు 4 న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నిన్నే పెళ్లాడతా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రం వెనుక దాగిన జ్ఞాపకాలు..

1. ఇండస్ట్రీ హిట్నిన్నే పెళ్లాడతా 1996 లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 12.85 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది.

2. ఒకే థియేటర్లో కోటినిన్నే పెళ్లాడతా ఒకే థియేటర్లో ఎక్కువగా గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. హైదరాబాద్ లోని దేవీ థియేటర్లో కలక్షన్ కోటి దాటింది.

3. 189 రోజులునిన్నే పెళ్లాడతా 39 సెంటర్స్ లలో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ లోని దేవీ, వైజాక్ లోని జ్యోతి, విజయవాడ లోని రాజ్ థియేటర్లలో 189 రోజులు హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ప్రదర్శించబడింది. నాగార్జున సినీ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న మొదటి చిత్రంగా నిన్నే పెళ్లాడతా రికార్డు నమోదు చేసింది.

4. బోలెడు అవార్డులునిన్నే పెళ్లాడతా వివిధ విభాగాల్లో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు, జాతీయ అవార్డు పొందింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ డైరక్టర్ కేటగిరీల్లో మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది.

5. కాలర్ లేని షర్ట్ ఫ్యాషన్ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువగా కాలర్ లేని షర్ట్, బ్లు షేడ్స్ జీన్స్ తో కనిపిస్తారు. ఆ తరం కుర్రకారు దీనిని బాగా ఫాలో అయ్యారు.

6. మరువలేని ఆల్బమ్బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ సందీప్ చౌతా ఈ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యారు. ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్.

7. ఏడీ గా రవితేజడైరక్టర్ వైవీఎస్ చౌదరీ, మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్లుగా పని చేశారు. ఆ సమయంలోనే వైవీఎస్ చౌదరీ, గీత (భార్య) ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

8. ఇళ్లా? సెట్టా ?నిన్నే పెళ్లాడతా సినిమాలో ప్రధానం రెండు ఇల్లు కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటాయి. ఆ రెండు సెట్ అంటే ఇప్పటికీ నమ్మలేం. ఆ విధంగా ఆర్ట్ డైరక్టర్ రెండు ఇల్లులను అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు.

9. విభిన్న పాత్రల్లో సీనియర్లుఎంతో మంది సీనియర్ నటీ నటులు ఇందులో కొత్తగా కనిపించారు. చలపతి రావు, చంద్ర మోహన్, గిరి బాబు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, బెనెర్జీ, ఉత్తేజ్, రమా ప్రభ వంటి వారికి ఈ చిత్రం బాగా పేరుతెచ్చి పెట్టింది.

10. ఇతర భాషల్లోనూ విజయంఉనాయి కల్యాణం పన్నికిరన్ (తమిళ్), జబ్ దిల్ కేసి పే ఆత హాయ్ (హిందీ) లో డబ్ అయి సూపర్ హిట్ సాధించింది. కన్నడలోను రీమేక్ అయి విజయం సాధించింది.

కాంబినేషన్ వెనుక సీక్రెట్
క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా పాటను జెమినీ టీవీలో వస్తుండగా నాగార్జున చూసి ముచ్చటపడ్డారు. వెంటనే డైరక్టర్ ని పిలిచి కథ ఉంటే చెప్పమని అడిగారు. అప్పుడు కృష్ణవంశీ సముద్రం కథను చెప్పారు. అది వద్దని.. వేరే జాన్రా లో స్టోరీ రెడీ చేయమని నాగ్ చెప్పడంతో నిన్నే పెళ్లాడతా.. కథను రాసుకొచ్చారు. ఆ స్టోరీ నచ్చడంతో సినిమా మొదలయింది. ఇద్దరి కెరీర్ లో గొప్ప చిత్రంగా నిలిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus