నెట్టింట హల్ చల్ చేస్తున్న నిషాల్ అగర్వాల్ ముద్దు ఫోటో..!
January 8, 2021 / 07:15 PM IST
|Follow Us
మొన్నటికి మొన్న అక్క(కాజల్) పెళ్లి చేసుకుని.. తన భర్తతో కలిసి హనీమూన్ కు మాల్దీవులకు వెళ్లి చేసిన సందడి అంతా ఇంతా కాదు. పెళ్లి ఫోటోలు కూడా అంత ఇదిగా పోస్ట్ చెయ్యలేదు కాదు.. తన భర్తతో హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను మాత్రం తెగ పోస్ట్ చేసింది కాజల్. మా అక్కతో పోల్చుకుంటే నేనేం తక్కువ అనుకుందేమో నిషా అగర్వాల్. ఆమె కూడా ఘాటు ఫోటోని షేర్ చేసి సోషల్ మీడియాకు హీట్ ఎక్కించింది. మ్యాటర్ ఏంటంటే..
తాజాగా నిషా అగర్వాల్ తన భర్త కరణ్ కు ఘాటు లిప్ లాక్ ఇచ్చింది. ఈ ఫోటోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఇదిలా ఉండగా.. కాజల్ చెల్లిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిషా అగర్వాల్.. ‘ఏమైంది ఈవేళ’ ‘సోలో’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అటు తరువాత ‘సుకుమారుడు’ చిత్రంలో కూడా నటించింది. అయితే హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో.. 2013 వ సంవత్సరంలో కరణ్ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది.
అటు తరువాత 2018 లో నిషా ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనా పాలనా చూస్తూ.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది నిషా. ఇదిలా ఉండగా.. త్వరలోనే ఈ బ్యూటీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందనే ప్రచారం జరుగుతుంది. నిజానికి బిజినెస్ మెన్ లను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు సినిమాల్లో నటించరు. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.