Sudhakar Reddy: టికెట్ రేట్ల పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కామెంట్స్ వైరల్..!

  • June 10, 2022 / 11:34 AM IST

కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రం ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్,సూర్య వంటి స్టార్ హీరోలు నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై విడుదల చేశారు. జూన్ 3న విడుదలైన ఈ మూవీ వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది.

నిర్మాత సుధాకర్ రెడ్డి ఆల్రెడీ లాభాల బాట పట్టారు. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి అందరికీ థాంక్స్ చెబుతూనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ” విక్రమ్ సినిమాని ముందు చూడలేదు. ట్రైలర్ చూడగానే ఇది వందశాతం డైరెక్టర్ సినిమా అని అర్థమైయింది. కమల్ హాసన్ గారు ఈ చిత్రాన్ని తన హోమ్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు.

అలాగే విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య లాంటి గొప్ప స్టార్ కాస్ట్ వుంది.నితిన్ కూడా సినిమా బాగుంటుంది తీసుకో డాడీ అని సజస్ట్ చేశాడు. మా నమ్మకం నిజమైయింది. సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తుంది, కమల్ గారు, ఎగ్జిబిటర్స్ అంతా హ్యాపీగా ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే టికెట్ రేట్ల పెంపు పై మాట్లాడుతూ. “రేట్లు మాత్రం ఎక్కువగా పెంచకూడదు. దీనికి నేను మొదటి నుండి వ్యతిరేకం.

బడ్జెట్ పెరిగిందని టికెట్ రేటు పెంచడం తప్పు కదా. ఎంత పెంచాలో అంతే పెంచాలి. సినిమా మూడు వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. ఇంట్లోనే చూసుకునే అవకాశం ఉన్నప్పుడు అంత డబ్బు ఎందుకు పెట్టాలి? అనే ఆలోచన జనాలకి రావడం సహజం.ప్రభుత్వం దగ్గరికి వెళ్లి టికెట్ రేట్లు అడిగాం. రూ.200 నుండి రూ.350 పెట్టుకోమన్నారు. అలా అని రూ.350 పెట్టకూడదు కదా. సినిమాని బట్టి పెట్టుకోవాలి. మేము మల్టీ ఫ్లెక్స్ లో రూ.200 మాత్రమే పెట్టాం. డబ్బు వచ్చింది కదా.

బాహుబలి 2 నైజాంలో సాధారణ ధరలకే రూ.55కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు రేట్లు ఎందుకు పెంచుతున్నారు ? టికెట్ అందరికీ అందుబాటులో వుంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు చూస్తారు. పైగా ఫ్యామిలీతో వస్తారు.ఇప్పుడు ఇద్దరు సినిమాకి వెళ్ళడానికే రూ.1000 పెట్టాలంటే ఎలా వెళ్తారు. ముంబై, బెంగళూరు లాంటి సిటీలో టికెట్ రేట్లు ఎక్కువున్నాయి కదా అంటే… మెట్రోపాలిటన్ సిటీలలో వీకెండ్స్ లో రూ.500, రూ.1000 ఇలా పెట్టుకుంటారు. దానికి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్తారు. మిగతా రోజులన్నీ మళ్ళీ తక్కువే కదా” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus