నితిన్ చేతికి కాటమరాయుడు నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు

  • February 11, 2017 / 12:48 PM IST

డాలీ దర్శకత్వంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న‘కాటమరాయుడు’ సినిమా 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ పూర్తికాక ముందే థియేటర్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. తాజాగా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు హీరో నితిన్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ లో వెల్లడించారు. ఆసియన్‌ ఫిల్మ్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ కలిసి పవర్‌స్టార్‌ ‘కాటమరాయుడు’ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. గబ్బర్ సింగ్ తర్వాత శృతిహాసన్ ఇందులో పవన్ తో జతకడుతోంది.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో పవర్ స్టార్ తొలిసారి ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 24 న థియేటర్లోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus