Nithiin: కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్న నితిన్.. కానీ?
May 15, 2023 / 03:09 PM IST
|Follow Us
టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నితిన్ కు అర్జెంట్ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్న వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ మూవీ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో నితిన్ ఒకింత రిస్క్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే నితిన్ (Nithiin) సురేందర్ రెడ్డి ఖాతాలో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి వార్తలు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి.
ఏజెంట్ మూవీ నష్టాల నుంచి కోలుకోవడం అనిల్ సుంకరకు సైతం సులువు కాదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా అఖిల్ కు భారీ షాకిచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఉంటే మరింత ఎక్కువ మొత్తం నష్టాలు వచ్చేవని చెప్పవచ్చు. సురేందర్ రెడ్డి కెరీర్ పరంగా ఇంత పెద్ద తప్పు ఎలా చేశాడో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బన్నీ సురేందర్ రెడ్డి, పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ల గురించి ప్రచారం జరిగినా ఈ కాంబినేషన్లలో ఇప్పట్లో సినిమా తెరకెక్కే పరిస్థితి లేదు. సురేందర్ రెడ్డి నేల విడిచి సాము చేయడం కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావల్సి ఉంది. సురేందర్ రెడ్డి రెమ్యునరేషన్ గతంతో పోలిస్తే తగ్గిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.