Nithiin: ఆ దర్శకునితో నితిన్ మూవీ ఉన్నట్టా? లేనట్టా?

  • October 13, 2022 / 04:55 PM IST

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ కు భారీ షాక్ తగిలిందనే సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్ గా రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో నితిన్ సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు రావడంతో భారీ నష్టాలను మూటగట్టుకుంది.

ఈ సినిమా రిలీజైన మరుసటి రోజే నిఖిల్ హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన కార్తికేయ2 విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల కూడా మాచర్ల నియోజకవర్గానికి ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లు రాలేదు. అయితే నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు కొన్ని నెలల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చాలామంది ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా తెరకెక్కుతుందని నమ్మారు. స్టార్ రైటర్ గా తనకంటూ మంచి పేరు,

గుర్తింపును సొంతం చేసుకున్న వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. వక్కంతం వంశీ ప్రాజెక్ట్ ను నితిన్ హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేయాలని నితిన్ వక్కంతం వంశీకి సూచించారని బోగట్టా.

వరుస ఫ్లాపుల నేపథ్యంలో కెరీర్ పరంగా రిస్క్ తీసుకోవడానికి నితిన్ సిద్ధపడటం లేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో నితిన్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నితిన్ నటించిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. నితిన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. కెరీర్ విషయంలో నితిన్ ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus