Nithiin: వామ్మో.. హిందీలో నితిన్ కు ఇంత ఫాలోయింగా?

  • February 27, 2022 / 06:21 PM IST

కెరీర్ తొలినాళ్లలో వరుసగా విజయాలను సొంతం చేసుకున్న నితిన్ తర్వాత కాలంలో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. సై సినిమా తర్వాత ఇష్క్ సినిమా వరకు నితిన్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు డిజాస్టర్లు కావడంతో పాటు నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చాయి. అయితే ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో నితిన్ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. అయితే ఈ టాలీవుడ్ హీరో హిందీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

నితిన్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. నితిన్ హిందీ సినిమాల యూట్యూబ్ వ్యూస్ ఏకంగా 2.3 బిలియన్లు కావడం గమనార్హం. సౌత్ ఇండియాలో ఈ రికార్డును కలిగి ఉన్న ఏకైన హీరో నితిన్ మాత్రమేనని తెలుస్తోంది. డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో నితిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. నితిన్ భవిష్యత్తు సినిమాలకు సైతం బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. భీష్మ, రంగ్ దే సినిమాలతో విజయాలను అందుకున్న నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే మూవీలో నటిస్తున్నారు.

నితిన్ కు జోడీగా ఈ సినిమాలో కృతిశెట్టి నటిస్తున్నారు. తెలుగు సినిమాలకు హిందీలో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కుతోందనే సంగతి తెలిసిందే. నితిన్ సాధించిన ఈ రికార్డును భవిష్యత్తులో ఏ హీరో బ్రేక్ చేస్తాడో చూడాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కృతిశెట్టి తెలుగులో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే.

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో కృతిశెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. సినిమాసినిమాకు కృతిశెట్టికి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. మాచర్ల నియోజకవర్గం సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus