భీష్మను ముగించి.. ఏలేటి సినిమా స్టార్ట్ చేయడానికే ఈ కంగారు!

  • September 13, 2019 / 09:40 AM IST

“లై. చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం” చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ సొంతం చేసుకొని అప్పటివరకూ నాలుగో గేరులో వెళ్తున్న బండికి ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసిన నితిన్.. కొన్నాళ్ళ విరామం అనంతరం మళ్ళీ ఫ్రెష్ జర్నీ స్టార్ట్ చేశాడు. అయితే.. వరుస ఫ్లాపులు మనోడి కాన్ఫిడెన్స్ ను ఏమాత్రం బ్రేక్ చేయలేదు. అందుకే.. ఒకేసారి మూడు సినిమాలు మొదలెట్టాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ”, వెంకీ అట్లూరి దర్శకత్వంలో “రంగ్ దే” మరియు చంద్రశేఖర్ ఏలేటి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని సినిమా సైన్ చేసి.. ఫుల్ బిజీ అయిపోయాడు.

రీసెంట్ గా “భీష్మ”లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసి.. డబ్బింగ్ కూడా మొదలెట్టాడు. ఈ సినిమాను పూర్తి చేసి ఇమ్మీడియట్ గా వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ మొదలెట్టడానికి సన్నద్ధమవుతున్నాడు. వెంకీ అట్లూరి సినిమా చేస్తూనే.. అదే టైమ్ లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చిత్రంలో కూడా సైమల్టేనియస్ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. మరి నితిన్ ఒకేసారి మొదలెట్టిన ఈ మూడు ప్రొజెక్ట్స్ తో హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus