Nithin, Surender Reddy: ఆ హిట్ సినిమాను నితిన్ వదులుకున్నారా?

  • August 8, 2022 / 06:41 PM IST

టాలీవుడ్ ఇండస్టీలోని ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో సురేందర్ రెడ్డి ఒకరనే సంగతి తెలిసిందే. ధృవ, సైరా నరసింహారెడ్డి సినిమాలతో విజయాలను అందుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాదే ఏజెంట్ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. తాజాగా జరిగిన మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సురేందర్ రెడ్డి గెస్ట్ గా హాజరయ్యారు. డైరెక్టర్ కావాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో నితిన్ కు మొదట కథ చెప్పానని సురేందర్ రెడ్డి అన్నారు.

దిల్ సినిమాతో నితిన్ ఖాతాలో సక్సెస్ చేరిన తర్వాత నేను నితిన్ ను కలిసి అతనొక్కడే సినిమా కథ చెప్పానని అన్నారు. నితిన్ కు కథ చెబుతున్న సమయంలో నా భయం పోయిందని అయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మా కాంబినేషన్ సెట్ కాలేదని ఆయన కామెంట్లు చేశారు. నితిన్ ఆ సినిమాలో నటించకపోయినా ధైర్యంతో అతనొక్కడే సినిమా చేశానని సురేందర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో నితిన్ తో కచ్చితంగా సినిమా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో నిజంగా సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. అతనొక్కడే సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు కళ్యాణ్ రామ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో కూడా మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డి కెరీర్ కు కీలకమని చెప్పవచ్చు. 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో అఖిల్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus