మంచి రేటుకి అమ్ముడైన నితిన్ సినిమా!

  • February 12, 2021 / 06:43 PM IST

గతేడాది ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరో నితిన్ ఖాతాలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. వీటిలో ‘రంగ్ దే’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావించారు. కానీ దాని కంటే ముందు ‘చెక్’ సినిమా వచ్చేస్తుంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జైలు నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఉరిశిక్ష పడిన ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం.

ఈ నెల 26న సినిమాను రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా బిజినెస్ ని క్లోజ్ చేశారు. సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాకి డీసెంట్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకి రూ.15 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. ఆంధ్ర ఏరియా రూ.10 కోట్ల రేషియోలో క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. సీడెడ్ హక్కులను కె.ఎఫ్.సి సంస్థ తీసుకుంది. నైజాం హక్కులను వరంగల్ శ్రీను రూ.5.40 కోట్లకు కొనుగోలు చేశారు.

ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ కి రూ.12 కోట్ల వరకు రేటు పలికింది. ఇక హిందీ డబ్బింగ్ మాత్రమే క్లోజ్ చేయాల్సివుంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus