విశ్వక్ సేన్ ను ఆకాశానికెత్తేసిన నివేదా పేతురాజ్!

  • March 21, 2023 / 05:15 PM IST

విశ్వ‌క్‌సేన్‌కి – నివేదా పేత‌రాజ్ కాంబినేషన్లో వచ్చిన రెండో మూవీ ‘దాస్ క ధమ్కీ’. గతంలో ఈ జంట ‘పాగల్’ లో నటించి మెప్పించింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఈ కాంబో మళ్ళీ ‘దాస్ క ధమ్కీ’ లో జతకట్టారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లో నివేదా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. త్రివిక్ర‌మ్‌ ను అలాగే లోకేష్ క‌న‌క‌రాజ్ ను కలిపితే విశ్వ‌క్‌సేన్ అంటూ ఈమె కితాబిచ్చింది.

‘దాస్ క ధమ్కీ’ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు. అంతకు ముందు అతను ‘ఫలక్ నుమా దాస్’ అనే చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. అది బాగానే ఆడింది. అయితే ‘దాస్ కా ధ‌మ్కీ’ చిత్రానికి విశ్వక్ ఓ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇప్పటివరకు తాను సంపాదించినదంతా ఈ సినిమా కోసం పెట్టేశాడు అని ప్రమోషన్లో తెగ చెప్పుకుంటున్నాడు. సరే ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం.

ఇదిలా ఉండగా.. ‘దాస్ క ధమ్కీ’ ప్రమోషన్లో నివేదా… విశ్వక్ ను త్రివిక్రమ్- లోకేష్ కనగరాజ్ తో పోల్చడం పై అంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.’దాస్ క ధమ్కీ’ చిత్రానికి కథ అందించింది ప్రసన్నకుమార్ బెజవాడ. ఇక ‘ఫలక్ నుమా దాస్’ కు చిత్రం ఓ రీమేక్. అవి తెలీకో ఏమో కానీ… ‘విశ్వ‌క్ ద‌గ్గ‌ర చాలా మంచి క‌థ‌లున్నాయి, వేరే హీరోతో సినిమా చేస్తే, నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటుంది, ముఖ్యంగా గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌లు విశ్వ‌క్ బాగా డీల్ చేస్తాడు, ఒక‌వేళ విశ్వ‌క్ గ్యాంగ్ స్ట‌ర్ సినిమా తీస్తే…

లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమా రేంజ్లో ఉంటుంది’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది. బాల‌య్య‌ హీరోగా విశ్వ‌క్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తే అదిరిపోతుంది అంటూ నివేదా చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus