Nivetha Pethuraj: ఏప్రిల్ 15న ‘ఆహా’ లో విడుదల కాబోతున్న నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’..!

  • April 9, 2022 / 03:10 PM IST

తెలుగు, తమిళ భాషల్లో మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్.ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క మంచి మంచి పాత్రలు ఏ సినిమాలో ఉన్నా ఆమె చేయడానికి వెనకాడటం లేదు. ‘మెంటల్ మదిలో’ ‘చిత్రలహరి’ ‘బ్రోచేవారెవరురా’ ‘అల వైకుంఠపురములో’ ‘రెడ్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మరో విభిన్నమైన పాత్రలో నటించడానికి రెడీ అవుతుంది. ఏప్రిల్ 15న నివేదా ‘బ్లడీ మేరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రతీవారం కంటెంట్ ఉన్న మంచి కొత్త సినిమాల్ని విడుదల చేస్తూ వస్తోన్న ‘ఆహా’ వారు వచ్చే వారం ‘బ్లడీ మేరీ’ ని ప్రేక్షకులకి అందించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ మూవీ పై జనాల్లో ఆసక్తి నెలకొంది. ‘కార్తికేయ’ ‘ప్రేమమ్’ వంటి హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో దీని పై మంచి క్రేజ్ నెలకొంది. ఇది వెబ్ మూవీ అయినప్పటికీ మంచి కథాంశంతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా రూపొందింది.

నివేదా ఈ చిత్రంలో అంధురాలు పాత్రలో కనిపించనుంది. ‘తన అంగవైకల్యాన్ని అధిగమించి, తనకు కావాల్సిన వారిని ప్రమాదం నుండీ ఆమె ఎలా కాపాడుకుంది’ అనే థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కింది. బ్రహ్మాజీ, అజయ్, కిరీటి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus